విశాఖపట్నంలోని మల్కాపురంలో ఒక అరుదైన సంఘటన జరిగింది. నేవీ క్యాంటీన్‌లో కనిపించిన ఆరు అడుగుల శ్వేతనాగు కనిపించింది. శుక్రవారం నాడు నేవీ క్యాంటీన్‌లో ఈ తెల్లటి నాగుపాము కనిపించింది. వెంటనే నేవీ ఉద్యోగులు స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. నాగరాజు అక్కడికి చేరుకుని పామును పట్టుకుని పరిశీలించగా, దాని పడగ భాగంలో తీవ్రమైన గాయాలున్నట్లు గుర్తించారు. వెంటనే పామును హిందూస్థాన్ షిప్‌యార్డ్ కాలనీలోని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యాధికారి సీహెచ్. సునీల్‌కుమార్ పాముకు మత్తుమందు ఇచ్చి గాయానికి . గాయంపై ఎనిమిది కుట్లు వేశారు. ఏదైనా వాహనం పాముపైకి ఎక్కడం వల్ల ఈ గాయం సంభవించి ఉండవచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. పాము పూర్తిగా కోలుకున్న తర్వాత, దానిని సురక్షితమైన ప్రదేశంలో విడిచిపెడతామని చెప్పారు.విశాఖలో పాములు కనిపిస్తే ఇలా చేయండివిశాఖపట్నం వీఎంసీ పరిధిలో మీ ఇంట్లోకి లేదా మీ చుట్టుపక్కల పాములు, కొండచిలువలు వచ్చాయా.. కంగారు పడకండి, వెంటనే జీవీఎంసీ స్నేక్‌క్యాచర్స్‌కు ఫోన్ చేయండి. జీవీఎంసీ తరఫున పనిచేస్తున్న స్కేక్ క్యాచర్స్ వెంటనే వస్తారు.. ఆ పాముల్ని పట్టేస్తారు. స్నేక్ క్యాచర్స్ పామును పట్టుకోవడానికి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోరు. జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ ఈఎన్‌వీ.నరేష్‌కుమార్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పాములు కనిపిస్తే భయపడకుండా వెంటనే జీవీఎంసీ స్నేక్‌క్యాచర్స్‌కు తెలియజేయాలని ఆయన ప్రజలకు సూచించారు. వారు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, పాములను సురక్షితంగా పట్టుకుని తీసుకెళ్తారు. ఈ సేవలకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అన్నారు.నగరంలో ఎక్కడ పాము కనిపించినా భయపడకుండా వెంటనే పాములు పట్టేవారికి సహాయం కోసం సంప్రదించవచ్చు. మీ మొబైల్‌లో పాము ఫోటో తీసి, సంబంధిత అధికారులకు పంపితే చాలు. ఆ ఫోటోను బట్టి, పామును పట్టడంలో నైపుణ్యం ఉన్నవారు 20 నిమిషాల్లో మీ వద్దకు వస్తారు. పాములను చంపడం చట్టరీత్యా నేరం. అంతేకాకుండా, అది ప్రమాదకరం కూడా. ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. దీనివల్ల లోతట్టు ప్రాంతాల్లో, కొండల పక్కన నివసించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. పాములు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఏదైనా అనుమానం వస్తే, వెంటనే అధికారులకు తెలియజేయండి. కింద స్నేక్ క్యాచర్లను సంప్రదించాల్సిన నంబర్లు కూడా ఉన్నాయి.రొక్కం కిరణ్‌కుమార్-8866368899ఎం దివ్యకాంత్-7013089384ఆర్ సురేష్‌కుమార్ 72073 07649నాగమోహన్ 95051 11769కె అప్పల రెడ్డి-9966448431జె దానయ్య-8328247679ఆర్ శేషు-9849529337సన్యాసిరావు-9849140500 నగరంలో ఎవరైనా ఈ నంబర్లను సంప్రదించొచ్చు.