బిగ్‌బాస్ హౌస్‌లోకి టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడం ఒక సూపర్ పెర్ఫామెన్స్‌తో ఎంట్రీ ఇచ్చిన సాయికి ఒక సూపర్ పవర్ ఇచ్చారు నాగార్జున. అంతకంటే ముందు నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్ అంటూ నాగార్జునతో చెప్పాడు సాయి. నిజానికి నేను ఎంట్రీ ఇచ్చిందే కేడీ సినిమాతో తర్వాత ఊపిరి కూడా చేశాను.. అలానే గోల్కొండ హైస్కూల్ చిత్రంలో కూడా నటించాను. సో అందరూ నన్ను అక్కినేని ఫ్యామిలీ వ్యక్తి అని అనుకుంటారు అని సాయి చెప్పాడు. ఇక హౌస్‌‌లోకి వెళ్లే ముందు డార్క్ బ్లూ స్టోన్ సాయికి ఇచ్చారు నాగార్జున. దీంతో ఇమ్యూనిటీ పవర్ వస్తుందని చెప్పారు.. ఇది ఉపయోగించి ఎలిమినేషన్‌లో ఎవరినైనా సేవ్ చేయొచ్చు అంటూ నాగ్ చెప్పారు.