Tata Capital Listing: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారికి ఐపీఓల గురించి తెలిసే ఉంటుంది. మంచి లిస్టింగ్ గెయిన్స్ చాలా మంది ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. ఇక ప్రముఖ కంపెనీల నుంచి వచ్చే ఐపీఓలకు డిమాండ్ ఫుల్ ఉంటుందని చెప్పొచ్చు. అయితే.. . ఇటీవల సబ్‌స్క్రిప్షన్ జరగ్గా.. షేర్ల అలాట్‌మెంట్ కూడా పూర్తి చేసింది. అక్టోబర్ 13న (సోమవారం) స్టాక్ మార్కెట్లోకి లిస్టయింది. అయితే.. ఇన్వెస్టర్లు ఇక్కడ ఎన్నో ఆశలు పెట్టుకోగా.. నిరాశపర్చిందని చెప్పొచ్చు. 10, 20 శాతం ప్రీమియం అయినా నమోదు చేస్తుందనుకుంటే అలా జరగలేదు. ఫ్లాట్ లిస్టింగ్ కావడం గమనార్హం. ఈ ఐపీఓ ఇష్యూ ధర రూ. 326 కాగా.. కేవలం 1.23 శాతం ప్రీమియంతో NSE లో రూ. 330 వద్ద లిస్టయింది. తర్వాత స్వల్పంగా పెరిగి రూ. 332 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత మళ్లీ వెనక్కి తగ్గడం గమనార్హం. రూ. 326.25 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. అయితే ఇది ఐపీఓ ఇష్యూ ధర కంటే కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. >> అయితే ఈ ఐపీఓ ద్వారా టాటా క్యాపిటల్ రూ. 15,512 కోట్లు సమీకరించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్ని.. టైర్-1 క్యాపిటల్ బేస్‌ను బలోపేతం చేసేందుకు.. భవిష్యత్తు క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. ఈ ఐపీఓకు డిమాండ్ కూడా సాధారణంగానే కనిపించింది. అంతకుముందు రెండేళ్ల కిందట టాటా గ్రూప్ నుంచి టాటా టెక్నాలజీస్ ఐపీఓ రాగా.. దానికి భారీ డిమాండ్ కనిపించిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లుగానే ఇది ఏకంగా 100 శాతానికిపైగా ప్రీమియం నమోదు చేసి లాభాల పంట పండించగా.. టాటా క్యాపిటల్ మాత్రం తేలిపోయింది. టాటా క్యాపిటల్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు కేవలం 1.95 రెట్ల స్పందన మాత్రమే లభించింది. అక్టోబర్ 6-8 మధ్య సబ్‌స్క్రిప్షన్ జరగ్గా.. ధరల శ్రేణి రూ. 310- రూ. 326 గా నిర్ణయించింది. రూ. 326 ఇష్యూ ధర చొప్పున మొత్తం లాట్ కింద 46 షేర్లుగా నిర్ణయించింది. ఇక్కడ కనీస పెట్టుబడి రూ. 14,996 గా ఉంది. ఇక రూ. 330 వద్ద లిస్టింగ్ కావడంతో ఇన్వెస్టర్లకు కేవలం రూ. 184 లాభం మాత్రమే వచ్చింది. ప్రస్తుతం టాటా క్యాపిటల్ స్టాక్ మార్కెట్ విలువ రూ. 1.39 లక్షల కోట్లుగా ఉంది.అప్పర్ లేయర్ NBFC లు 3 సంవత్సరాల్లోగా.. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాలన్న ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా.. టాటా క్యాపిటల్ ఐపీఓకు వచ్చింది. దీని కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో సెబీకి ముసాయిదా పత్రాల్ని సమర్పించింది. జులైలో గ్రీన్ సిగ్నల్ లభించింది.