ఢిల్లీ టెస్టులో పోరాడుతున్న విండీస్! సెంచరీ దిశగా హోప్.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రోస్టన్ ఛేజ్!!

Wait 5 sec.

ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ వేదికగా సాగుతున్న ఈ టెస్టులో మూడో రోజుకే విండీస్ ఖేల్ ఖతం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా . ఇక నాలుగో రోజు మొదటి సెషన్‌లో కూడా వెస్టిండీసే పైచేయి కనబరిచింది. దాంతో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి నుంచి వెస్టిండీస్ తప్పించుకున్నట్టయింది. 173/2 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన వెస్టిండీస్.. మొదటి సెషన్ ముగిసే సమయానికి కేవలం ఒక్క వికెటే కోల్పోయి 79 పరుగులు చేసింది. విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ సెంచరీ చేయడంతో టెస్టుపై విండీస్ పట్టు సాధించినట్టయింది. 199 బంతులు ఆడిన క్యాంప్‌బెల్ 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 115 పరుగులు చేసి అవుటయ్యాడు. 2002 తర్వాత భారత గడ్డపై సెంచరీ చేసిన ఏకైక ఓపెనర్‌గా క్యాంప్‌బెల్ నిలిచి రికార్డు సృష్టించాడు. క్యాంప్‌బెల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చి కెప్టెన్ రోస్టన్ ఛేజ్ అద్భుతంగా ఆడి లంచ్ బ్రేక్ సమయానికి మరో వికెట్ పడకుండా కాపాడాడు. కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన షై హోప్ కూడా అద్భుతం ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి వెస్టిండీస్ 3 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేయగా.. రోస్టన్ ఛేజ్ 23, షై హోప్ 92 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. 270 పరుగుల ఫాలో ఆన్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్ జట్టు మూడో రోజుతో పాటు నాలుగో రోజు మొదటి సెషన్ కూడా అద్భుతంగా ఆడింది. ఒకానొక దశలో ఇన్నింగ్స్ తేడాతో విండీస్ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే క్యాంప్‌బెల్, హోప్ రాణించడంతో ఆ గండం నుంచి బయటపడింది. భారత్ అందించిన మొదటి ఇన్నింగ్స్ లక్ష్యానికి లంచ్ బ్రేక్ సమయానికి వెస్టిండీస్ 18 పరుగుల దూరంలో ఉంది. ఈ రోజు మొత్తం విండీస్ బ్యాటర్లు క్రీజులో కొనసాగితే ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.