భారీగా పడుతున్న చమురు ధరలు.. 5 నెలల కనిష్టానికి.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

Wait 5 sec.

Petrol Diesel Rates: కొంత కాలంగా అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ.. ముడి భారీగా దిగొస్తున్నాయి. ఒకవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతున్నప్పటికీ.. ఇదే సమయంలో అమెరికా- చైనా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం జరగనుందనే ఆందోళనలు దీనికి కారణంగా తెలుస్తున్నాయి. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య మళ్లీ వివాదం చెలరేగుతోంది. ఆ మధ్య ఉద్రిక్తతలు తగ్గినట్లే కనిపించినప్పటికీ ట్రంప్ మళ్లీ చైనాపై 100 శాతం సుంకాల్ని విధించనున్నట్లు ప్రకటించారు. దీంతో క్రూడాయిల్ రేట్లు పడిపోతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రోజు ఇది 5 నెలల కనిష్టానికి దిగొచ్చింది. >> యూఎస్ క్రూడ్ (WTI) 4.24 శాతం తగ్గడంతో బ్యారెల్ ముడిచమురు ధర 58.90 డాలర్ల వద్ద ఉంది. ఇదే సమయంలో గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 62.73 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇక్కడ కారణాలేంటో తెలుసుకుందాం. >> చైనా ఇటీవల అరుదైన ఎర్త్ ఖనిజాల ఎగుమతులపై (రేర్ ఎర్త్ మినరల్స్) కఠిన నియంత్రణా పర నిబంధనలు విధించింది. దీంతో ట్రంప్ ప్రతీకారానికి దిగారు. ఈ క్రమంలోనే చైనా నుంచి వచ్చే ఉత్పత్తులపై భారీగా సుంకాల్ని విధించేందుకు పరిశీలిస్తున్నట్లు చెప్పారు ట్రంప్. దీంతో అధిక సుంకాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిని మందగిస్తాయని.. దీంతో చమురు డిమాండ్‌ను తగ్గిస్తాయని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో ఇలాంటి పరిస్థితులు చమురు మార్కెట్ వృద్ధిని తగ్గిస్తుందని చెబుతున్నారు. దీనికి తోడు ఒపెక్ ప్లస్ కూటమి.. కొన్నాళ్లుగా మార్కెట్లో సరఫరా పెంచుతున్న కారణంగా చమురు ధరలు ఒత్తిడిలో ఉన్నాయి. రిఫైనరీ నిర్వహణ కారణంగా క్రూడాయిల్ డిమాండ్ గణనీయంగా తగ్గుతోందని తెలుస్తోంది. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశీయంగా చూస్తే.. ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఇక్కడ గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి.అప్పట్లో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రేట్లు అంతర్జాతీయంగా భారీగా పెరిగినా.. దేశీయంగా స్థిరంగానే ఉంచడం వల్ల తమకు నష్టాలు వచ్చాయని చమురు మార్కెట్ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగించింది. కిందటి సారి పార్లమెంట్ ఎన్నికల సమయంలో లీటర్‌ పెట్రోల్, డీజిల్ ధర రూ. 2 చొప్పున తగ్గించింది కేంద్రం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చూస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 107.41 వద్ద ఉంది. ఇక డీజిల్ ధర లీటర్ రూ. 95.70 వద్ద ఉంది. ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే రేట్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయని చెప్పొచ్చు.