ఎదురైంది. విశాఖ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వరల్డ్ రికార్డ్ స్కోర్ చేసింది. అయినప్పటికీ ఆస్ట్రేలియా జట్టు ఆ స్కోర్‌ని ఛేదించి మరో రికార్డును సృష్టించింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడానికి అసలైన కారణం ఇదే అంటూ మ్యాచ్ అనంతరం చెప్పింది.విశాఖలో జరిగిన ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన (80), ప్రతికా రావల్‌ (75) అద్భుతమైన ఆరంభ భాగస్వామ్యంతో భారత జట్టు 330 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆస్ట్రేలియా ఒక్క ఓవర్‌ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. ఈ పరాజయం అనంతరం కెప్టెన్‌ హార్మన్‌ప్రీత్‌ కౌర్‌ మాట్లాడుతూ "మేము చివరి ఆరు ఓవర్లలో 30 - 40 పరుగులు అదనంగా చేయాల్సింది. టాప్‌ ఆర్డర్‌ మంచి ఆరంభం ఇచ్చినా, లోయర్‌ ఆర్డర్‌ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయింది. అదే మా ఓటమికి కారణమైంది" అని స్పష్టం చేసింది.భారత్‌ 42.5 ఓవర్లలో 294/4 వద్ద నిలిచినప్పుడు 350 దాటుతుందనే అంచనా వేసినా, చివరి ఆరు ఓవర్లలో కేవలం 36 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్‌ అన్నాబెల్‌ సదర్లాండ్‌ ఐదు వికెట్లు పడగొట్టి భారత లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌ను చిత్తు చేసింది."టాప్‌ ఆర్డర్‌ బాగా ఆడింది, వాళ్ల వలన మేము 300 దాటగలిగాం. కానీ చివరి ఐదు ఓవర్లలో రన్‌రేట్‌ పడిపోయింది. గత మూడు మ్యాచ్‌ల్లో మిడిల్‌ ఓవర్స్‌లో విఫలమయ్యాం, ఈరోజు చివరి ఓవర్లు వదిలేశాం" అని హార్మన్‌ప్రీత్‌ అనింది.టీమిండియా వ్యూహాలు ఫలించడం లేదు. మరోసారి భారత్‌ ఐదు బౌలర్లతోనే ఆడటం మళ్లీ విమర్శలకు తావిచ్చింది. అదనపు బ్యాటర్‌తో బలపడుతుందని భావించిన ఈ వ్యూహం తిరిగి విఫలమైంది. అయితే కెప్టెన్‌ హార్మన్‌ప్రీత్‌ మాత్రం దీనిని సమర్థిస్తూ “ఈ కాంబినేషన్‌తో మేము విజయాలు సాధించాం. రెండు ఓటములు వ్యూహం తప్పు అని నిరూపించవు. చర్చించి సరిదిద్దుకుంటాం” అని స్పష్టం చేసింది.సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాపై ఓటమి అనంతరం భారత్‌ ఇండోర్‌లో ఇంగ్లండ్‌తో ఆదివారం తలపడనుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌తో ఆడటం భారత్‌కు కత్తి మీద సామే అని చెప్పొచ్చు. ఆస్ట్రేలియా ఏడు పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ ఆరు పాయింట్లతో రెండు, భారత్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ సున్నా పాయింట్లతో అట్టడుగు స్థానంలో పడి ఉంది.