ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన పంటల సాగు దిశగా రైతుల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రణాళిక కింద నిధులు కేటాయించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. వాణిజ్య పంటలు పండిస్తున్న రైతులు, పంట మార్పిడి చేసి అధిక ఆదాయం పొందాలనుకునే వారికి పండ్ల తోటల విస్తరణ పథకం ద్వారా రాయితీలు కల్పిస్తున్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.రైతులు పూర్తి వివరాల కోసం స్థానిక ఉద్యానశాఖ అధికారులను, రైతుసేవా సిబ్బందిని సంప్రదించాలి. . పంటలు ఎండిపోకుండా కాపాడుకోవడానికి నీటి తడుల కోసం సేద్యపు నీటికుంటల ఏర్పాటుకు 50 శాతం, సామూహిక నీటి కుంటల నిర్మాణానికి 75 శాతం రాయితీ లభిస్తుంది. ఈఆర్థికంగా అండగా నిలుస్తాయి. అధిక ఆదాయం ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించడమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశ్యం. రైతులు ఈ ప్రోత్సహకాలను అందిపుచ్చుకుని లాభాలు పొందవచ్చని సూచిస్తున్నారు అధికారులు. పాత తోటల పునరుద్ధరణ పథకం అమలు చేస్తోంది. తోటలో ఎండిన, చనిపోయిన చెట్లను తొలగించి.. కొత్త మొక్కలు నాటేందుకు హెక్టారుకు రూ.10వేలు ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తుంది. అంతేకాదు ఖర్చులో 50శాతం రాయితీ ఇస్తారు.. ఒక్కో రైతుకు 2 హెక్టార్ల వరకు గరిష్ఠంగా వర్తిస్తుంది. అలాగే పూల తోటల విస్తీర్ణ పథాన్ని కూడా అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా హెక్టారుకు ప్రభుత్వం రూ.50వేలు అందిస్తుంది. తోట సాగు చేసిన రైతులకు హెక్టారుకు 40 శాతం రాయితీ కింద రూ.20వేలు ఇస్తారు. రక్షిత సేద్య పద్ధతిలో అధిక విలువ కలిగిన పంటలు.. నారు మొక్కల పెంపకానికి కేబుల్‌ పర్లిన్‌లో సాగు ప్రోత్సహించందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులకు పంటల సాగు ఖర్చుపై 50 శాతం రాయితీ గరిష్ఠంగా 2,500 చ.మీ వరకు చదరపు మీటరుకు రూ.225 వరకు అందుతుంది. 'మామిడి, అరటి తోటల్లో పండు ఈగ నివారణకు కాయలకు కవర్లు తొడిగే రైతులకు హెక్టారుకు రూ.5వేలు రాయితీ ఇస్తారు. యాంటీ బర్డ్‌ పథకం కింద హెక్టారుకు రూ.48వేలు రాయితీ ఇస్తారు' అని అధికారులు తెలిపారు.డ్రాగన్‌ రూ.2.70లక్షలు, అరటికి రూ.70వేలు, బొప్పాయి రూ.30వేలు గరిష్ఠంగా ఒక హెక్టారుకు రాయితీ ఇస్తారు. జామ హెక్టారుకు రూ.80వేలు, మామిడి సాగుకు హెక్టారుకు రూ.50వేలు, బత్తాయి హెక్టారుకు రూ.50వేల వరకు ఇస్తారు. గరిష్ఠంగా 2 హెకార్ల వరకు ఒక రైతుకు రాయితీ ఇస్తారు. దానిమ్మ రూ.50వేలు, సీతాఫలం రూ.30వేలు, రేగిపండు రూ.30వేలు (హెక్టారుకు) చొప్పున రాయితీ ఇస్తారు. గరిష్ఠంగా 2 హెక్టార్ల వరకు వర్తిస్తుంది. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.