హమ్మయ్య.. నిరీక్షించినందుకు అద్భుత ఫలితం.. ఆ రెండు ప్రాంతాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యంగా చేపట్టిన త్వరలో ప్రారంభం కానుంది. ఈ కొత్త మార్గం ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ను రీజినల్ రింగ్ రోడ్డు (RRR) కు అనుసంధానిస్తూ.. దక్షిణ తెలంగాణ జిల్లాలకు వేగవంతమైన అనుసంధానాన్ని అందించనుంది. ORR నుండి RRR వరకు.. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 (రావిర్యాల) నుండి ఈ 41.5 కిలోమీటర్ల రేడియల్ రహదారి (Radial Highway) విస్తరించి ఉంటుంది. ఈ మార్గం కడ్తాల, ఆమనగల్లు మండల కేంద్రాల గుండా వెళ్లనుంది. ఈ రహదారి కోసం ఇటీవల టెండర్ల ప్రక్రియ (Tender Process) ఖరారైంది. . రెండవ దశలో.. మీర్ ఖాన్ పేట నుంచి రీజినల్ రింగ్ రోడ్డు పరిధిలోని ఆమనగల్లు వరకు సుమారు 22.30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రహదారి పూర్తయితే.. ఇది ఓఆర్ఆర్ ను, త్రిబుల్ ఆర్ (RRR) ను నేరుగా కలుపుతుంది. దీనివల్ల దక్షిణ ప్రాంతాలకు ప్రయాణించే సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న రహదారులపై రద్దీ తగ్గి, సులభతర ప్రయాణం సాధ్యమవుతుంది.భూసేకరణ ప్రణాళికలు..ఈ గ్రీన్ ఫీల్డ్ మార్గం నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ ప్రక్రియపై అధికారులు నిమగ్నమయ్యారు. కడ్తాల్, ముద్విన్, ఆకుతోటపల్లి, ఆమనగల్లు వంటి గ్రామాలలో సుమారు 200కు పైగా ఎకరాల భూమిని కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే, ఆయా మండలాల అభివృద్ధికి మహర్దశ పడుతుందని.. స్థలాల ధరలు అమాంతం పెరుగుతాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయం ప్రకారం.. ఈ రహదారి వలన దక్షిణ జిల్లాలకు ప్రవేశ ద్వారం ఏర్పడుతుందన్నారు. ఈ ప్రాంతాలు వృద్ధి చెందడంతో పాటు, ఔషధ (ఫార్మా), ఎలక్ట్రానిక్స్, ఐటీ అనుబంధ రంగాలలో లక్షలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రైతుల ఆందోళనలు.. జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ (DCCB) డైరెక్టర్ , పీఏసీఎస్ చైర్మన్ (PACS Chairman) గంప వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ.. గ్రీన్ ఫీల్డ్ రహదారి కారణంగా వేలాది మంది వ్యవసాయదారులు తమ క్షేత్రాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. నష్టపరిహారం గురించి స్పష్టత ఇవ్వకుండానే టెండర్లు పిలవడం ఆశ్చర్యకరం అని ఆయన విమర్శించారు. ముందుగా భూమికి బదులుగా భూమి (Land for Land) ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం తగిన పరిహారం చెల్లించాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు.