జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నాకొద్దీ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్.. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఆయన భార్య . ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అంత సాఫీగా సాగుతున్న సమయంలో బీఆర్ఎస్‌కు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. జూబ్లీహిల్స్ బరిలో- డెమొక్రటిక్ (టీఆర్ఎస్-డీ) అనే పార్టీ బరిలోకి దిగింది. దీంతో బీఆర్ఎస్‌కు డ్యామేజ్ జరుగుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది టీఆర్ఎస్- డీ పార్టీ. ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని టీఆర్ఎస్- డీ పార్టీ అధ్యక్షుడు వెల్లడించారు. శనివారం (అక్టోబర్ 11) బషీర్‍బాగ్ ప్రెస్ క్లబ్లో పార్టీ జెండాతో పాటు వెబ్‍సైట్‍ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా లోగో రూపకల్పన చేశామని తెలిపారు. టీఆర్ఎస్- డీ కొత్త జెండా.. తెలంగాణ ప్రతిబింబం అని అన్నారు. కాగా, జూబ్లీహిల్స్‌‌లో తమ అభ్యర్థిగా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచర్ల మంజూష పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని నరాల సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. గులాబీ దళంలో టెన్షన్..జూబ్లీబిల్స్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్- డీ పార్టీ ఎంట్రీతో రాజకీయం రసవత్తరంగా మారింది. గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా రావడంతో.. బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. ఎందుకంటే.. టీఆర్ఎస్ పార్టీ జెండా, పేరు ఒకేలా ఉండటం పార్టీ శ్రేణులను కలవర పరుస్తోంది. చాలా మంది ఓటర్లకు బీఆర్ఎస్ కంటే ఎక్కువగా టీఆర్ఎస్ అనే తెలుసు. ఇక టీఆర్ఎస్- డీ జెండా కూడా గులాబీ రంగులో ఉండటంతో.. ఓటర్లు తికమక పడే అవకాశం ఉంది. గతంలో కారును పోలిన రోడ్డు రోలర్, రోటీ మేకర్‌ సింబల్స్‌తో స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగితే.. గులాబీ ఓటుబ్యాంకుకు గండి పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అలా జరిగి ఓట్లు చీలితే.. బీఆర్ఎస్‌కు నష్టం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక వేళ టీఆర్ఎస్ పార్టీకి.. కారును పోలిన గుర్తు కేటాయిస్తే.. నష్టం తప్పదని అంటున్నారు. దీంతో ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్-డీ పార్టీ ఏ మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.