జనార్ధన్ రావు ఆరోపణలకు జోగి రమేష్ కౌంటర్.. ఎలాంటి శిక్షకైనా సిద్ధమంటూ ఛాలెంజ్

Wait 5 sec.

అన్నమయ్య జిల్లా ములకలచెరువు తిరుగుతోంది. ఈ కేసులో తొలుత టీడీపీ నేత జయచంద్రారెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. అనంతరం ఊహించని రీతిలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పేరు తెరపైకి రావటం సంచలనం రేపుతోంది.నకిలీ మద్యం కేసులో సోమవారం విడుదలైంది. ఈ వీడియోలోచేశారు. వైసీపీ హయాంలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ జరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిఘా పెరగటంతో తయారీని ఆపేసినట్లు తెలిపాడు. అయితే ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశంతో మళ్లీ తయారు చేయాలని జోగి రమేష్ ఆదేశించారని.. చంద్రబాబుకు చెడ్డపేరు తేవడానికి చిత్తూరు జిల్లాలోనే తయారు చేయాలని చెప్పారన్నారు. జోగి రమేష్ ఆఫర్ చేసిన మూడు కోట్ల రూపాయలకు ఆశ పడే ఇదంతా చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో జనార్ధన్ రావు ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. మీడియాతో మాట్లాడిన జోగి రమేష్.. కల్తీ మద్యం కేసును దమ్ముంటే సీబీఐకు అప్పగించాలన్నారు. నకిలీ మద్యం కేసు విచారణను సిట్‌కు అప్పగించారన్న జోగి రమేష్.. ఆ సిట్.. చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనేలా ఉంటుందని విమర్శించారు. ఎవరో ఒకర్ని నకిలీ మద్యం కేసులో ఇరికించాలనే కుట్ర జరుగుతోందని జోగి రమేష్ ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే కేసును సిట్ ద్వారా కాకుండా సీబీఐ ద్వారా విచారణ చేయించాలన్నారు. నకిలీ లిక్కర్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్న జోగి రమేష్.. తనకు సంబంధం ఉందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. రిమాండ్ రిపోర్టులోనూ తన పేరు లేదని వెల్లడించారు. ఈ విషయంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అని చంద్రబాబుకు, నారా లోకేష్‌కు జోగి రమేష్ సవాల్ విసిరారు.కల్తీ మద్యం కేసు.. సిట్ ఏర్పాటు..మరోవైపు అన్నమయ్య జిల్లా ములకలచెరువు కల్తీ మద్యం కేసును దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి అధిపతిగా ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రత్యేక దర్యాప్తు బృందంలో సభ్యులుగా రాహుల్‌దేవ్‌శర్మ, కె.చక్రవర్తి, మలికా గర్గ్‌‌లను నియమించారు. మరోవైపు కల్తీ మద్యం కేసుపై ఏపీ ఎక్సైజ్‌ పోలీసులు ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కల్తీ మద్యం కేసు దర్యాప్తుపై 15 రోజులకోసారి నివేదిక ఇవ్వాలని సిట్‌ను ప్రభుత్వం ఆదేశించింది.