కిలో 'బంగారం' దాచుకుంటే 'విమానం' కొనొచ్చు.. హర్ష్ గోయెంకా ఆసక్తికర ట్వీట్

Wait 5 sec.

: భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ధరల పెరుగుదలతో ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలోనే బంగారం ధరలు ఏకంగా 64 శాతం పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు దేశీయ మార్కెట్లో ఏడాది క్రితం అంటే 2024, అక్టోబర్ 11వ తేదీన రూ.75,319 వద్ద ఉండగా ఈరోజు అక్టోబర్ 13, 2025 రోజున చూసుకుంటే తులం బంగారం రూ.1,23,377 వద్దకు చేరుకుంది. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఇప్పుడు పసిడిపైనే చర్చ నడుస్తోంది. సామాన్య ప్రజల నుంచి దిగ్గజ వ్యాపారవేత్తల వరకు బంగారం గురించే మాట్లాడుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో . ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. అది 2000 సంవత్సరానికి వచ్చే సరికి ఎస్టీమ్ కారు, 2005లో ఇన్నోవా, 2010లో అయితే ఫార్చ్యూనర్, 2019లో అయితే బీఎండబ్ల్యూ, 2025లో అయితే ల్యాండ్ రోవర్ కారు కొనుగోలు చేయవచ్చు. కానీ, అదే కిలో బంగారాన్ని అట్టిపెట్టుకుని ఉన్న వారు 2030లో ఏకంగా రోల్స్ రాయిస్ కారు కొనొచ్చని, ఇంకాస్త వేచి చూసి 2040 వరకు ఆగితే ఏకంగా ప్రైవేట్ జెట్ విమానం కొనుగోలు చేయవచ్చంటూ రాసుకొచ్చారు. వచ్చే దశాబ్ద కాలంలో బంగారం ధర ఆ స్థాయిలో దూసుకెళ్లొచ్చని అంచనా వేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. బంగారం ధరల పెరుగుదలపై మీమ్స్ వస్తున్న క్రమంలో హర్ష్ గోయెంకా సైతం ఇలాంటి పోస్ట్ చేయడం ఆసక్తి రేపుతోంది. 1990లో 1 కిలో బంగారం ఉంటే మారతీ 800 కారు2000లో 1 కిలో బంగారం ఉంటే ఈస్టీమ్ కారు2005లో 1 కిలో బంగారం ఉంటే ఇన్నోవా కారు2010లో 1 కిలో బంగారం ఉంటే ఫార్చ్యూనర్ కారు2019లో 1 కేజీ బంగారం ఉంటే బీఎండబ్ల్యూ కారు2025లో 1 కిలో బంగారం ఉంటే ల్యాండ్ రోవర్ కారు2030లో 1 కిలో బంగారం ఉంటే రోల్స్ రాయిస్ కారు2040లో 1 కిలో బంగారం ఉంటే ఒక ప్రైవేట్ జెట్ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా నిర్ణయాలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటివి బంగారం పెరుగుదలకు కారణమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రాజకీయ, వాణిజ్య అనిశ్చితి కారణంగా పెట్టబడిదారులు బంగారాన్ని సురక్షిత మార్గంగా చూస్తున్నారు. కోట్లాది రూపాయలు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అమెరికా డాలర్ విలువ బలహీనపడుతుండడమూ బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నట్లు చెబుతున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు దేశాల కేంద్ర బ్యాంకులు సైతం బంగారం భారీగాకొనుగోలు చేస్తున్నాయి.