బిగ్‌బాస్ హౌస్‌లో రీ ఎంట్రీపై శ్రీజ దమ్ము క్లారిటీ.. ‘అందుకే జర్నీ వీడియో కూడా వేయలేదు.. వైజాగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ’

Wait 5 sec.

ఎలిమినేషన్‌పై అందరిదీ ఒకేమాట. ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తున్నారు కాబట్టి.. నువ్వు దొబ్బేయ్ అన్నంత దారుణంగా ఆమెను హౌస్ నుంచి బయటకు పంపేశారు. కనీసం ఆమె జర్నీ వీడియో కూడా ప్లే చేయకుండా హౌస్ నుంచి బయటకు పంపించేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీజ హౌస్‌లో ఉన్నప్పుడు ఆమె ఆట గురించి నెగిటివ్‌గా కామెంట్ చేసిన వాళ్లు కూడా.. ఆమె ఎలిమినేషన్‌ని తప్పుపడుతున్నారంటే.. ఆమెను ఎంత అన్యాయంగా బయటకు పంపించారో అర్థం చేసుకోవచ్చు. శ్రీజ ఎలిమినేషన్ చూసే ఆడియన్స్‌కే షాక్ అనుకుంటే.. ఆమెకి అంతకంటే పెద్ద షాకింగ్ అనే చెప్పాలి. అసలు హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిన దమ్ము శ్రీజా.. మెల్ల మెల్లగా కోలుకుంది. అయితే ఆమె త్వరలోనే బిగ్ బాస్ హౌస్‌లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతుందనే వాదనలకు బలంగా వినిపిస్తుండగా.. వీటిపై క్లారిటీ ఇస్తూ ఎమోషనల్ అయ్యింది . బిగ్ బాస్ హౌస్ నేను ఎలిమినేట్ అవుతానని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బ్లాంక్ అయిపోయాను. సీక్రెట్ రూంకి పంపిస్తారేమో.. డోర్లు తీసేప్పుడైనా వెనక్కి పిలుస్తారేమో.. ప్రాంక్ చేస్తున్నారేమో అని చాలా అనుకున్నాను. కనీసం ఏవీ కూడా ప్లే చేయకుండా.. బిగ్ బాస్ బజ్‌కి రెడీ అయిపోండి అని చెప్పినప్పుడు అప్పుడు నమ్మాను ఎలిమినేట్ అయ్యానని. ఫస్ట్ రెండు వారాలు నేను జనాలకి నచ్చలేదని ఫీడ్ బ్యాచ్ వచ్చింది. తరువాత నుంచి మార్చుకున్నాను. నచ్చుతూ వచ్చా.. సపోర్ట్ చేశారు. సేవ్ చేశారు. ఫిజికల్ టాస్క్‌లలో కూడా గట్టి ఫైట్ ఇచ్చాను. బట్ లక్ కూడా కలిసి రావాలి కదా.. బట్ ఖచ్చితంగా ఉంటాననే అనుకున్నా. విన్నర్ మెటీరియల్ అనుకున్నా. కానీ అనుకోకుండా ఎలిమినేట్ అయ్యాను. నేను అక్కడ వరకూ వెళ్లానంటే ఆడియన్స్ సపోర్ట్ వల్లే. వాళ్లకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరూ అనుకోలేదు.. నేనూ అనుకోలేదు.. ఇంత త్వరగా నన్ను బయట చూస్తారని. స్టార్ మా, జియో హాట్ స్టార్‌కి థాంక్స్ చెప్తున్నా.. సామాన్యులకి తీరని కలగా ఉన్న బిగ్ బాస్‌లో కామనర్స్‌కి ఛాన్స్ ఇచ్చారు. నాగార్జున సార్‌కి థాంక్స్. నేను ఒకటే చెప్పగలను. నేను బయటకు వచ్చాను.. విన్నర్ అవుతాననే అనుకున్నాను. అంతా అనుకున్నది అనుకున్నట్టు అయితే లైఫ్ ఎందుకు అవుతుంది. నేను హౌస్‌లో ఉన్నప్పుడు సపోర్ట్ అయితే లేదు. ఏది మాట్లాడినా నెగిటివ్ నెగిటివ్ అని అనేవారు. నన్ను నేను మార్చుకుంటూ వచ్చా. కానీ వాళ్లు మాత్రం నన్ను దూరం పెడుతూనే ఉన్నారు. వాళ్లు నాతో మాట్లాడేవారు కాదు.. పోనీ నేను వెళ్లి మాట్లాడదామని ప్రయత్నిస్తే లేచి వెళ్లిపోయేవారు. హౌస్‌లో కళ్యాణ్ ఒక్కడే నాకు సపోర్ట్‌గా ఉన్నాడు. లాస్ట్ వీక్‌లో తనూజ కూడా హెల్ప్ చేసింది. ఆమె కూడా అర్థం అయ్యింది. రెండు మూడు సందర్భాల్లో వాళ్లు నన్ను ఎలా టార్గెట్ చేస్తున్నారో దగ్గరుండి చూసింది. కళ్యాణ్‌ని నేను తమ్ముడూ అని పిలుస్తా. వాడు అంత కష్టపడ్డా కెప్టెన్సీ రాకపోయేసరికి.. వాడు ఎలాగైనా కెప్టెన్ కావాలని అనుకున్నా. కెప్టెన్ చేస్తా అన్నాను.. చేశాను.. కానీ వాడి కెప్టెన్సీ పూర్తిగా చూడకుండా బయటకు వచ్చేశాను. నేను నాగార్జున గారి ముందు కాలిమీద కాలేసుకుని కూర్చొన్నానని చాలా నెగిటివ్ అయ్యింది. కామనర్స్‌కి పొగరు తలకెక్కిందని అందుకే కాలు మీద కాలేసుకుందని చాలా రకాలుగా ట్రోల్ చేశారు. నాకు మిగతా వాళ్ల గురించి తెలియదు కానీ.. నాకొక టాస్క్‌లో గాయాల పాలయ్యాను. నా కంఫర్ట్ పొజిషన్‌లో నేను కూర్చున్నాను. చూస్తే హాట్ బ్యాగ్స్ పెట్టుకుంటూనే ఉండేదాన్ని. చాలాసార్లు మెడికల్ రూంకి వెళ్లి వచ్చేదాన్ని. కాలు మీద కాలు వేసుకున్నానంటే నాగార్జున గారు ఉన్నారని కాదు.. ఆయనకి గౌరవం ఇవ్వలేదని కాదు.. నాకు ఆరోగ్యం బాలేక.. నా కంఫర్ట్‌ని బట్టి కాలు మీద కాలేసుకున్నా. నా జర్నీ వీడియో ప్లే చేయలేదు కాబట్టి.. చాలామంది రీ ఎంట్రీ ఉంటుందని అనుకుంటున్నారు. అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటకు రాలేదు. నేను స్ట్రాంగ్ అని చెప్పి తీసేశారు. రీ ఎంట్రీ నిజంగానే ఉంటే ఖచ్చితంగా వెళ్తాను. రీ ఎంట్రీ లేకపోతే చేసేదేం లేదు.. ఆల్రెడీ బయటే ఉన్నాను కాబట్టి. చూద్దాం ఏమౌతుందో. నాకు నిజంగా రీ ఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు. బట్ నన్ను హౌస్‌లో చూడాలి అనుకుంటే నాకు సపోర్ట్ చేయండి. ముఖ్యంగా నేను వైజాగ్ నుంచి వచ్చాను కాబట్టి.. వైజాగ్ వాళ్లంతా గట్టిగా సపోర్ట్ చేశారు.. ఇకపై కూడా సపోర్ట్ చేయండి’ అని ఆడియన్స్‌ని కోరింది దమ్ము శ్రీజ.