: స్టాక్ మార్కెట్లలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా.. అయితే మీకు ఐపీఓల గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ మంచి లిస్టింగ్ గెయిన్స్ ఆశిస్తుంటారు. అయితే ఇటీవల రెండు ప్రముఖ ఐపీఓలు వచ్చిన సంగతి తెలిసిందే. .. ఇష్యూ ధర దగ్గరే ఫ్లాట్‌గా లిస్టయి నిరాశపర్చింది. అయితే.. మరో అతిపెద్ద ఐపీఓగా వచ్చిన సౌత్ కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం.. ఎల్‌జీ భారత సబ్సిడరీ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ దుమ్మురేపిందని చెప్పొచ్చు. ఇది మంగళవారం (అక్టోబర్ 14) రోజు దేశీయ మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే రిటర్న్స్ అందించడం విశేషం. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ధరల శ్రేణి రూ. 1080-1140 గా నిర్ణయించగా.. ఇష్యూ ధర చివరకు రూ. 1140 గా ఖరారు చేసింది. దీంతో పోలిస్తే ఏకంగా 50 శాతం ప్రీమియంతో ఇప్పుడు రూ. 1710 వద్ద ఎన్‌ఎస్ఈలో లిస్టయింది. దీంతో ఒక్కో షేరుపైనే రూ. 570 లాభం రావడం విశేషం. ఈ క్రమంలోనే ఐపీఓలో భాగంగా సక్సెస్‌ఫుల్‌గా షేర్లు అలాట్ అయిన వారికి కాసుల వర్షం కురిసిందని చెప్పొచ్చు. పెట్టుబడిలో సగం వరకు లాభాలు వచ్చాయన్నమాట. 50 శాతం ప్రీమియంతో రూ. 1710.10 వద్ద లిస్టింగ్ అవగా.. మళ్లీ 2-3 శాతం వరకు పెరిగి ఇంట్రాడేలో రూ. 1749 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. మళ్లీ తగ్గి రూ. 1650 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. ఈ వార్త రాసే సమయంలో (మధ్యాహ్నం 12 గంటలకు) చూస్తే 47 శాతం ప్రీమియంతో రూ. 1680 స్థాయిలో ట్రేడవుతోంది. ఇక పెట్టుబడి పరంగా చూస్తే ఒక్కో లాట్ కింద కనీసం 13 షేర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ లెక్కన రూ. 1140 ఇష్యూ ధర దగ్గర చూస్తే.. కనీస పెట్టుబడి రూ. 14,820 గా ఉంది. వీరికి లిస్టింగ్‌తో అంటే రూ. 1710.10 దగ్గర చూస్తే.. చేతికి రూ. 22,231.3 వచ్చింది. ఇక్కడ లాభం రూ. 7,411.30 గా ఉంది. గరిష్ట ధర రూ. 1749 దగ్గర చూస్తే.. దాదాపు రూ. 8 వేల లాభం వచ్చిందన్నమాట.ఈ ఐపీఓ విషయానికి వస్తే.. అక్టోబర్ 7-9 మధ్య సబ్‌స్క్రిప్షన్ జరగ్గా సుమారు రూ. 11 వేల కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో వచ్చిన ఐపీఓకు ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 4.39 లక్షల కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఇంత డిమాండ్ కనిపించడం చరిత్రలో ఇదే తొలిసారి. ఏకంగా 54 రెట్ల స్పందన లభించింది.