Multibagger: స్మాల్ క్యాప్ కేటగిరిలోని టెక్స్టైల్ సెక్టార్ కంపెనీ బిజోటిక్ కమర్షియల్ లిమిటెడ్ () తమ షేర్ హోల్డర్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ స్టాక్ ఈ రోజు ట్రేడింగ్ సెషన్‌లో 2 శాతం మేర లాభపడి అప్పర్ సర్క్యూట్ తాకింది. దీంతో ఆల్ టైమ్ హై స్థాయిని చేరింది. 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బిజోటిక్ కమర్షియల్ నికర లాభం 521 శాతం పెరిగింది. ఈ విషయం కంపెనీ ప్రకటించిన క్రమంలో ఈ స్టాక్ పరుగులు పెడుతోంది. గత 10 రోజుల నుంచి వరుసగా ఈ కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్ కొడుతూ కాసులు కురిపిస్తున్నాయి. లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.6.10 లక్షలు అందించింది. 2026 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెలతో ముగిసిన రెండో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను బిజోటిక్ కమర్షియల్ ప్రకటించింది. రెండో క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం 521 శాతం వృద్ధితో రూ. 8.38 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. అలాగే రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆపరేషన్ రెవెన్యూ 40 శాతం లాభంతో రూ. 73.8 కోట్లుగా నమోదు చేసింది. ఫలితాల ప్రకటన తర్వతా కంపెనీ స్టాక్ కొనేందుకు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. దీంతో వరుసగా అప్పర్ సర్క్యూట్ తాకుతోంది. ప్రస్తుతం ఈ రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో బిజోటిక్ కమర్షియల్ షేరు ధర 2 శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్ టచ్ చేసి రూ. 587 స్థాయిలో ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర కూడా రూ. 587 కావడం గమనార్హం. 52 వారాల కనిష్ఠ ధర రూ. 70.06 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ స్టాక్ 8 శాతం లాభపడింది. గత ఏడాది కాలంలో 393 శాతం లాభపడింది. గత ఐదేళ్లలో 243 శాతం లాభాన్ని ఇచ్చింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ. 472 కోట్ల వద్ద ఉంది. ఈ కథనం సమాచారం అందించడం కోసమే. ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కాదు. స్టాక్ మార్కెట్లో హైరిస్క్ ఉంటుంది. తీవ్ర ఒడుదొడుకులు ఉంటాయి. సరైన అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం అంత మంచిది కాదు. నిపుణుల సలహాలు తీసుకోవడం బెటర్. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.