: కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. 2025 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికానికి గానూ (GPF) వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇది జీపీఎఫ్ సహా కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (CPF), ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్ సహా ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్న ఇతర పథకాలకు కూడా వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది కేంద్రం. అక్టోబర్- డిసెంబర్ 2025 కాలానికి గానూ ఈ వడ్డీ రేట్లు అన్ని పథకాలకు ప్రస్తుతం 7.10 శాతంగా నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుబంధంగా ఉండే వ్యవహారాల శాఖ దీనికి సంబంధించి ఒక సర్క్యులర్ విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. గత కొంత కాలంగా వడ్డీ రేట్లను కేంద్రం మార్చట్లేదు. కనీసం ఈసారైనా పెరుగుతాయని భావించిన వారికి మళ్లీ నిరాశే ఎదురైందని చెప్పొచ్చు. >> మొత్తం ఏమేం పథకాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ది జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (సెంట్రల్ సర్వీసెస్)ది కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (ఇండియా)ది ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్ ది స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్ది జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (డిఫెన్స్ సర్వీసెస్)ది ఇండియన్ ఆర్డ్‌నెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రావిడెంట్ ఫండ్ది ఇండియన్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీస్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్ది ఇండియన్ నావల్ డాక్‌యార్డ్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్ది డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్ది ఆర్మ్‌డ్ ఫోర్సెస్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటే?జీపీఎఫ్ అంటే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉద్దేశించింది. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరూ తమ వేతనాల్లో కొంత భాగం.. జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌కు జమ చేయొచ్చు. ఉద్యోగులు రిటైర్ అయినప్పుడు.. తమ సర్వీస్ కాలంలో మొత్తం జమ చేసిన మొత్తానికి వడ్డీ కలిపి పూర్తిగా తీసుకోవచ్చు. ఆర్థిక మంత్రి.. జీపీఎఫ్ వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికానికి ఒకసారి సమీక్షిస్తారని చెప్పొచ్చు. ఇక ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. వీరికి వడ్డీ రేటు 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ 8.25 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చి సమయంలో నిర్ణయిస్తుంటుంది. ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను కేంద్రం సవరించింది. ఇక్కడ కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. రేట్లు పెరుగుతాయని భావించినప్పటికీ మళ్లీ మళ్లీ నిరాశే ఎదురవుతోంది.