బిగ్‌బాస్ సీజన్-9లోకి వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. దివ్వెల మాధురి, రమ్య మోక్ష, అయేషా జీనత్‌, శ్రీనివాస్ సాయిలతో పాటు సీరియల్ హీరోలు నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్‌కార్డ్ లిస్ట్‌గా నాలుగవ కంటెస్టెంట్‌గా నిఖిల్ నాయర్.. చివరి కంటెస్టెంట్‌గా గౌరవ్ వచ్చారు.ముందుగా స్టేజ్ మీదకి వచ్చిన నిఖిల్ నాయర్‌కి మోహన్ లాల్ వీడియోతో సర్‌ప్రైజ్ ఇచ్చారు నాగార్జున. నిఖిల్‌కి పింక్ స్టోన్ ఇచ్చి హౌస్‌లోకి పంపించారు. దీని వల్ల కంటెండర్ పవర్ నిఖిల్‌కి దక్కింది. ఇది ఉపయోగించి నువ్వు డైరెక్ట్‌గా కెప్టెన్సీ కంటెండర్ అవ్వొచ్చు.. అని నాగ చెప్పారు. ఇక చివరి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లాడు గౌరవ్ గుప్తా. ఇతనకి తెలుగు కాస్త తక్కువగా వచ్చు. దీంతో మాట్లాడటానికి ఇబ్బంది పడ్డాడు. ఇక గౌరవ్‌కి బ్లెస్సింగ్ పవర్ ఇచ్చారు నాగ్. దీనితో హౌస‌లో ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌ నుంచి సలహా అడిగి బయటపడే పవర్ అన్నమాట.