బిగ్‌బాస్ డే 35: ఘోరమైన రీతిలో శ్రీజ ఎలిమినేషన్.. దివ్వెలతో గొడవ.. భరణి ఫేక్ అంటూ

Wait 5 sec.

బిగ్‌బాస్ సీజన్-9 నుంచి ఊహించని ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ ముందు నుంచి హింట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. దానికి తగ్గట్లే ఎపిసోడ్ మొదట్లోనే . ఆ తర్వాత డేంజర్ జోన్‌లో ఉన్న ఐదుగురుకి (రీతూ, డీమాన్, సుమన్, సంజన, శ్రీజ) టాస్కులు పెట్టారు.ఇందుకోసం వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో మూడు రకాల టాస్క్‌లు పెట్టారు. ఇందులో ముందుగా సంజన సేఫ్ కాగా ఆ తర్వాత రీతూ, డీమాన్‌లు సేవ్ అయ్యారు. ఇక చివరిగా సుమన్ శెట్టి-శ్రీజ మిగిలారు. అప్పుడు ఊహించని విధంగా వీళ్ల నుంచి ఒకర్ని ఎలిమినేట్ చేసే పవర్ వైల్డ్‌కార్డ్స్ చేతికి ఇచ్చారు నాగార్జున.దివ్వెల గొడవతో మారిన ఈక్వేషన్సుమన్ శెట్టి-శ్రీజలలో ఎవరిని ఉంచాలి అనేది వైల్డ్‌కార్డ్స్ చేతిలో పెట్టడంతో శ్రీజకి పెద్ద షాకే తగిలింది. ఎందుకంటే సింపుల్‌గా చెప్పాలంటే సుమన్-శ్రీజలలో శ్రీజ చాలా స్ట్రాంగ్. ఈ విషయం వైల్డ్‌కార్డ్స్‌కి కూడా తెలుసు. అలాంటి వాళ్ల చేతిలో ఎలిమినేషన్ పవర్ పెడితే ఆటోమేటిక్‌గా తమకి అడ్డు లేకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని తప్పిస్తారు. వీళ్లు కూడా అదే చేశారు.మొత్తం ఆరుగురిలో నలుగురు శ్రీజ ఎలిమినేట్ కావాలని కోరుకోగా మరో ఇద్దరు మాత్రం సుమన్ శెట్టి ఔట్ కావాలని ఓట్ చేశారు. శ్రీజకి గౌరవ్ గుప్తా, శ్రీనివాస్ మాత్రమే పాజిటివ్‌గా ఓటేశారు. నిజానికి దివ్వెల మాధురి హౌస్‌లోకి రాగానే శ్రీజతో గొడవ జరిగింది. మీ పేరేంటి అని అడిగిన దానికి మాధురి గొడవపెట్టుకుంది.నా పేరు తెలీదా నీకు.. అందరికీ తెలుసు నేను ఎవరో అంటూ మాధురి చెప్పింది. దీనికి శ్రీజ అదేంటి మీరు అందరికీ తెలియాలని ఏముంది.. నాకు తెలీదు మీ పేరు చెప్తే ఏమైంది అంటూ శ్రీజ కూడా గట్టిగానే వాదించింది. దీంతో ఏంటి ఇప్పుడు రాగానే గొడవ పెట్టుకోవాలని అనుకుంటున్నావా అని మాధురి అసహనంగా చెప్పింది.ఇది జరిగిన తర్వాత ఆటోమేటిక్‌గా దివ్వెల మైండ్‌లో శ్రీజపై ఒక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. సో మాధురి కూడా శ్రీజకి వ్యతిరేకంగానే ఓటేసింది. ఇక శ్రీజ ఎలిమినేట్ అయిన తర్వాత కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు. శ్రీజ ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్‌మేట్స్ అందరూ షాకయ్యారు. ఏవీ కూడా లేకుండాతర్వాత శ్రీజ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కనీసం జర్నీ వీడియో కూడా ప్లే చేయలేదు. సడెన్ ఎలిమినేట్ కావడంతో జర్నీ వీడియో చేయలేకపోయాం అంటూ నాగార్జున చెప్పారు. ఎలిమినేషన్ గురించి ఏమనుకుంటున్నావని అడిగితే శ్రీజ ఇదే విషయం చెప్పింది. సాధారణంగా బిగ్‌బాస్‌లో ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్ జరుగుతుంది.. కానీ అలా కాకుండా నేను స్ట్రాంగ్ అని తీసేయడం కరెక్ట్‌గా అనిపించలేదని శ్రీజ చెప్పింది.ఇక వెళ్లేటప్పుడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఎవరికి ఇస్తావని నాగ్ అడిగారు. డీమాన్‌కి ఫ్రెండ్, భరణికి ఎనిమీ, కళ్యాణ్‌కి ట్రస్ట్, సంజనకి రియల్, సుమన్‌కి వీక్, దివ్యకి ఫేక్, ఇమ్మూకి స్ట్రాంగ్, రీతూ, తనూజ, రాములకి గుడ్ అనే ఆప్షన్ ఇచ్చింది శ్రీజ.ఇక వెళ్లే ముందు ఇలాగే దమ్ముగా ఉండమ్మా అంటూ శ్రీజకి చెప్పారు నాగ్. చివరికి ఎపిసోడ్ పూర్తయ్యే ముందు ఇక నుంచి అంతా వేరే లెవల్లో ఉంటుంది.. రణరంగానికి కొత్త ప్లేయర్లు వచ్చారు.. రెడీగా ఉండండి.. అంటూ నాగ్ చెప్పారు.