డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.15వేలు ఇస్తున్నారు, నిధులు విడుదల

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డ్వాక్రా సంఘాలకు తీపికబురు చెప్పింది.. వారందరికి రివాల్వింగ్‌ ఫండ్‌ ప్రకటించారు.. ఒక్కో సంఘానికి రూ.15 వేలు ఇస్తారు. ఈ మేరకు రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 వేల కొత్త డ్వాక్రా సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.15 వేల చొప్పున ఈ నిధిని అందిస్తారు. ఈ డబ్బును సంఘ సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది సంఘం ఖాతాలోనే నిల్వ ఉంటుంది. ఈ రివాల్వింగ్ ఫండ్ ద్వారా సంఘం నిధిని పెంచుకోవచ్చు. సభ్యుల అవసరాలకు అనుగుణంగా సంఘం లోపలే అప్పులు మంజూరు చేసుకోవచ్చు. అంతేకాకుండా, బ్యాంకుల నుంచి ఎక్కువ మొత్తంలో రుణం పొందడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. త్వరలోనే ఈ నిధులు సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇప్పటికే జిల్లాలకు సంఘాల జాబితాను పంపించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం డ్వాక్రా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.డిప్యూటీ సీఎం మాటామంతిఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ నేడు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో మాటామంతీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 'జెడ్పీ సీఈవోలు, డ్వామా పీడీలు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలు, జడ్పీ డిప్యూటీ సీఈవోలు, డీడీఓలు, డీఎల్‌పీవోలు హాజరు కావాలి' అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజ ఆదేశించారు. ఏపీలో వారికి స్కాలర్‌షిప్‌లు విడుదలఆంధ్రప్రదేశ్‌లో పీఎంజీఎస్‌వై (ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన) పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన రోడ్లకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు బిల్లులు చెల్లించే నిమిత్తం రూ.47.84 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇటు సమగ్ర శిక్షా అభియాన్‌ ఉపకారవేతనాలను కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు విడుదల చేశారు. ఈ మేరకు ఒక్కొక్క విద్యార్థినికి నెలకు రూ.100 చొప్పున 10 నెలలకు కలిపి రూ.వెయ్యి విడుదల చేసింది. మొత్తం 1,07,580 మంది విద్యార్థినులు రూ.10.76 కోట్లు విడుదలయ్యాయి. స్టాంపు రుసుము మినహాయింపుఏపీ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ పీవీ ఉత్పత్తి ప్లాంట్‌కు స్టాంపు రుసుము మినహాయింపు ఇచ్చింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో ఇండోసోల్‌ సోలార్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ పీవీ మాడ్యూల్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కరేడులో 8,348 ఎకరాలు, గుడ్లూరు మండలం చేవూరులో 114.5 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించారు.. ఈ మేరకు షిర్డీసాయి అనుబంధ సంస్థ సూర్యచక్ర డెవలపర్స్‌కు 798.98 ఎకరాల భూమి కేటాయించారు. అయితే రూ.12.19 కోట్ల స్టాంపు రుసుము మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.