భారీ శుభవార్త చెప్పిన తపాలా శాఖ.. వాటిపై ప్రత్యేక రాయితీలు..

Wait 5 sec.

విద్యార్థులకు తపాలా సేవలను మరింత వేగంగా.. ఆధునికంగా అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా లో ప్రత్యేక 'జన్‌జీ థీమ్' తపాలా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుమిత అయోధ్య పర్యవేక్షణలో ఈ కార్యాలయాన్ని ఎన్‌ఐటీ డైరెక్టర్ ఆచార్య బిద్యాధర్ సబూధి ప్రారంభించారు. ఈ కార్యాలయం ముఖ్యంగా విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు , అధునాతన సేవలను అందించనుంది.విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు .. టు.. ఈ నూతన థీమ్ కార్యాలయం యువత అవసరాలకు అనుగుణంగా విభిన్న సేవలను అందిస్తుంది. విద్యార్థులకు ప్రత్యేకంగా రాయితీతో కూడిన స్పీడ్ పోస్ట్ (Speed Post) సేవలను అందిస్తారు. దీనివల్ల విద్యార్థులు తక్కువ ఖర్చుతో తమ పత్రాలు,పార్శిళ్లను పంపుకోవచ్చు. పోస్ట్ మాస్టర్ జనరల్ సుమిత అయోధ్య మాట్లాడుతూ.. ఈ కార్యాలయంలో సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అలాగే.. , పార్సిల్ బుకింగ్ , క్యూఆర్ ఆధారిత చెల్లింపులు (QR Based Payments) వంటి డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు, సిబ్బంది కోసం బీమా సేవలు, ఆధార్ (Aadhaar) సంబంధిత సేవలు (అప్‌డేట్‌లు వంటివి) కూడా ఇక్కడే అందుబాటులో ఉంచారు.క్యాంపస్‌లో పోస్టాఫీస్ ప్రయోజనం.. ఎన్‌ఐటీ డైరెక్టర్ ఆచార్య బిద్యాధర్ సబూధి మాట్లాడుతూ.. క్యాంపస్‌లో ఈ అధునాతన పోస్టాఫీస్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. విద్యార్థులకు తక్షణ, వేగవంతమైన సేవలు అవసరం అని.. ఈ కార్యాలయం ఆ అవసరాలను తీరుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హాజరైన ఆచార్యులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు నూతన సేవలపై సమగ్ర అవగాహన కల్పించారు.ఈ ప్రారంభ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య సునీల్‌కుమార్ మెహతా, హనుమకొండ తపాలా కార్యాలయ సూపరింటెండెంట్ నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల పిల్లలకు కూడా ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ చొరవ వల్ల ఎన్‌ఐటీ వరంగల్‌లోని విద్యార్థులు, సిబ్బంది తమ అవసరాల కోసం క్యాంపస్ బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అన్ని రకాల తపాలా .. అనుబంధ సేవలను ఒకే చోట పొందగలుగుతారు.