భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో సాధించింది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆ జట్టు 40 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. అనంతరం భారత్‌ను 162 పరుగులకు ఆలౌట్ చేసింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో గెలిచిన ప్రొటీస్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది.214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు.. ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ (17), అక్షర్ పటేల్ (21), సూర్యకుమార్ యాదవ్ (5) త్వరగానే ఔట్ అయ్యారు. దీంతో 67 పరుగులకే టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో తిలక్ వర్మ (34 బంతుల్లో 62 రన్స్‌) ఒంటరి పోరాటం చేశాడు. హార్దిక్ పాండ్యా (20), జితేశ్ శర్మ (27) కాసేపు సహకారం అందించారు.సౌతాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. చివరకు 19.1 ఓవర్లలో టీమిండియా 162 పరుగులకు ఆలౌట్ అయింది. 51 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ (62) భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో బార్ట్‌మన్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. లుంగీ ఎంగిడి, మార్కో జాన్సెన్, సిపామ్లా తలో రెండు వికెట్లు పడగొట్టారు.అంతకుముందు సౌతాఫ్రికా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగి 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. డికాక్ 46 బంతుల్లో 7 సిక్స్‌లు, 5 ఫోర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. ఇక తాజా ఫలితంతో రెండు మ్యాచ్‌లు ముగిసే సరికి సిరీస్ 1-1తో సమమైంది. మూడో టీ20 మ్యాచ్‌ డిసెంబర్ 14న ధర్మశాల వేదికగా జరగనుంది.