ఐటీఆర్-1, 4 ఫైల్ చేశారా.. 'నోటీసు' పంపుతోన్న ఐటీ శాఖ.. డిసెంబర్ 31లోపు పూర్తి చేయాల్సిందే..!

Wait 5 sec.

Income Tax: ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే వారు వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం ఫైల్ చేసి తమ ఆదాయాలకు సంబంధించిన వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి నివేదించాల్సి ఉంటుంది. అదనపు పన్నులు చెల్లించినట్లయితే రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఏదైనా ఆదాయానికి సంబంధించిన వివరాలు దాచిపెట్టినా లేదా తక్కువ పన్నులు కట్టినా నోటీసులు వస్తాయి. దీంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తాజాగా ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం కీలక హెచ్చరికలు చేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ పోస్ట్ ప్రకారం.. ' పన్ను చెల్లింపుదారులు దయచేసి గమనించండి. మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం నుంచి ఏదైనా సందేశం వచ్చిందా? దయచేసి మీ ఐటీఆర్‌ను ఓసారి తనిఖీ చేసుకోండి. అందులో FA, FSI, TR చెక్ చేసి విదేశీ ఆదాయ, ఆస్తుల వివరాలు సరిగ్గా అన్ని ఇచ్చామా లేదా చూసుకోవాలి. ఇవ్వకపోతే ఈ డిసెంబర్ 31, 2025 లోపు మీ రిటర్నులను సవరించండి. జాప్యం చేకుండా తనిఖీ చేసుకుని మీ రిటర్నులను సవరించండి. మీరు ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 గనక ఫైల్ చేస్తే మీరు రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు షెడ్యూల్ ఎఫ్ఓ, ఎఫ్ఎస్ఐ, టీఆర్ కనిపించనట్లయితే మీరు తప్పుడు ఐటీఆర్ ఫారం ఎంచుకున్నట్లు అవుతుంది. రివైస్ చేసేటప్పుడు సరైన ఐటీఆర్ ఫారం ఎంచుకోండి. మీకు సంబంధించిన అన్ని రకాల విదేశీ ఆస్తులు, ఆదాయ వివరాలు వెల్లడించండి. మీకు NUDGE రిమైండర్ వస్తే జాప్యం చేయకుండా మీ రిటర్నులను రివైస్ చేసి తప్పులను సరి చేసుకోండి. ' అని ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా ఎక్స్ ఖాతా ద్వారా సూచించింది. పన్ను ఎగవేతను అరికట్టడానికి, స్వచ్ఛందంగా పన్ను నిబంధనలను పాటించేలా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మరోసారి ముఖ్యంగా విదేశీ ఆస్తులు లేదా విదేశీ ఆదాయాన్ని తమ రిటర్న్స్‌లో వెల్లడించని పన్ను చెల్లింపుదారులను లక్ష్యంగా చేసుకుంది. పన్ను చెల్లింపుదారులపై చర్యలు తీసుకోకుండా, వారు చేసిన పొరపాట్లను స్వచ్ఛందంగా సరిదిద్దుకునేలా ప్రోత్సహించడమే ఈ నడ్జ్ ఉద్దేశం. ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (AEOI) ఫ్రేమ్‌వర్క్ కింద ఇతర దేశాల నుంచి భారతదేశానికి అందిన సమాచారం ప్రకారం విదేశీ ఆస్తులు కలిగి ఉన్న ట్యాక్స్ పేయర్లకు రిమైండర్లు పంపిస్తోంది.