ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం (డిసెంబర్ 11) సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు లో 44 అజెండా అంశాలకు ఆమోదం లభిచింది. మీటింగ్ తర్వాత మంత్రి పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ సమావేశం వివరాలను వెల్లడించారు. రూ. 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. ఇక పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్‌భవన్‌, అసెంబ్లీ దర్బార్‌ హాల్‌ నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ కార్యాలయం, గెస్ట్‌ హౌస్‌లు, స్టాఫ్‌ క్వార్టర్ల నిర్మాణానికి కేబినెట్ భేటీలో సమావేశంలో చర్చించి అంగీకారం తెలిపారు. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది.ని.. 16వ నేషనల్ హైవేకు అనుసంధానించే పనులకు రూ. 532కోట్ల మేర టెండర్లు ఆహ్వానించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కుప్పంలో పాలేరు నదిపై చెక్‌ డ్యాంల నిర్వహణకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. భాషా పండితులకు పదోన్నతులు.. గిరిజన సంక్షేమశాఖలో 417కి కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఇక ఏపీ ప్రిజన్స్‌ అండ్‌ కరెక్షనల్‌ సర్వీసెస్‌ ముసాయిదా బిల్లుపై కేబినెట్‌లో చర్చించి ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటు ఎస్‌ఐపీబీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు, రూ. 20 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 26 సంస్థలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలను జిల్లాలోనే సమీక్షించాలని ఇంచార్జి మంత్రులను సీఎం ఆదేశించారు. మంత్రులు పరిష్కరించాల్సిన పనులు కూడా.. తన దృష్టికి తీసుకొస్తే ఎలా ప్రశ్నించారు. కాగా, చేనేతలకు ఉచిత విద్యుత్ అంశాన్ని ఆర్థిక శాఖ పెండింగ్‌లో ఉంచడం పట్ల.. పలువురు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం పథకం పీఎం సూర్య ఘర్‌తో అనుసంధానం చేశారని.. అలా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించని వారి లబ్ధిదారుల పట్టాలు రద్దు చేయాలని కోరారు. అయితే ఇది సాధ్యం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు.