హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘దేఖ్లేంగే సాలా’ అనే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. 'రంపంపం రంపంపం.. స్టెప్పేస్తే భూకంపం..'' అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది. పవన్ చాలా రోజుల తర్వాత డ్యాన్స్ చేయడం అభిమానులకు ట్రీట్ అనే చెప్పాలి. ‘దేఖ్లేంగే సాలా’ పాటకి దేవిశ్రీ ప్రసాద్‌ ట్యూన్ కంపోజ్ చేయగా.. విశాల్‌ దడ్లానీ ఆలపించారు. భాస్కర భట్ల లిరిక్స్ రాశారు.