ఉచిత బస్సు ప్రయాణానికి రెండేళ్లు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇక నుంచి వాటిలో కూడా..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రారంభమై నేటికి (డిసెంబర్ 9) సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో.. 2023 డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన ఈ పథకం మహిళా సాధికారతకు గొప్ప మార్గంగా నిలిచింది. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు, ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనుహ్య స్పందనను దక్కించుకుంది. తొలి రోజుల్లో కొన్ని చిన్న సమస్యలు ఎదురైనా.. ప్రభుత్వం వెంటనే వాటిని పరిష్కరించడంతో, పథకం వినియోగం భారీగా పెరిగింది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు ఈ వినియోగించుకున్నారు. దీని మొత్తం విలువ రూ. 8,459 కోట్లుగా నమోదైంది.ఈ పథకం ద్వారా మహిళలు ప్రయాణించడమే కాకుండా.. కుటుంబాల మధ్య బంధుత్వాలు పెంచడం, తరచుగా దేవాలయాలను సందర్శించడం, హాస్పిటల్ చికిత్సలకు సులభంగా వెళ్లడం.. పిల్లల విద్యా వ్యవస్థను మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి వీలు కలిగిందని మంత్రి తెలిపారు. ఆర్టీసీ సాధారణ బస్సులతో పాటు.. త్వరలోనే అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వీటిలో కూడా మహిళలకు ఉచితంగ ప్రయాణిస్తుండగా.. ఇక మున్ముందు ప్రవేశపెట్టే కల్పిస్తామన్నారు. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే.. భవిష్యత్తులో ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఆర్టీసీ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. ఈ స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తే.. వాటిని ఉపయోగించి మాత్రమే మహిళలు ఉచిత ప్రయాణం చేసే విధంగా కీలక మార్పు అమల్లోకి రానుంది. పథకం అమలులో క్షేత్రస్థాయిలో వచ్చే ఏవైనా సమస్యలను వెంటనే పరిష్కరించేలా ఒక కొత్త విధానాన్ని కూడా అమలులోకి తీసుకురానున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మహిళలు బస్సులలో ప్రయాణం చేయడమే కాకుండా.. తెలంగాణ ప్రభుత్వం మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.