Hardik Pandya గర్ల్‌ఫ్రెండ్‌ను వల్గర్‌గా వీడియోలు తీసిన పాపరాజీలు.. లైన్ క్రాస్ చేశారంటూ హార్దిక్ ఫైర్

Wait 5 sec.

టీమిండియా ఆల్‌రౌండర్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముంబైలోని బాంద్రాలో ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో మహీకా శర్మను పాపరాజీలు అసభ్యకరమైన కోణంలో వీడియో తీయడంతో హార్దిక్‌ను తీవ్రంగా మండిపడ్డాడు. ఈ ఘటనపై హార్దిక్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. “మనమంతా పబ్లిక్ లైఫ్‌లో ఉంటాం. దాంతో వచ్చే అటెన్షన్, స్క్రూట్నీ అన్నీ ఓకే. కానీ ఈరోజు జరిగింది అసలు కరెక్ట్ కాదు. బాంద్రాలోని రెస్టారెంట్‌లో మెట్లు దిగుతూ వస్తుండగా, మహీకాను పాపరాజీలు ఎలాంటి స్త్రీని అయినా ఫోటో తీయకూడని కోణంలో షూట్ చేశారు. ఒక సాధారణ మోమెంట్‌ను చీప్ సెన్సేషనలిజం‌గా మార్చేశారు” అంటూ హార్దిక్ పాపరాజీలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. .“ఇది హెడ్‌లైన్స్ గురించో, ఎవరెం షూట్ చేశారో గురించో కాదు.. ఇది బేసిక్ రెస్పెక్ట్ విషయం. ప్రతి మహిళకీ గౌరవం అవసరం. ప్రతి ఒక్కరికీ బౌండరీలు కావాలి. మీడియా సోదరులు మీరు ఎంతో కష్టపడుతున్నారని నాకు తెలుసు. నేను ఎప్పుడూ సహకరిస్తాను. కానీ దయచేసి కొంచెం జాగ్రత్త. ప్రతి యాంగిల్ షూట్ చేయాల్సిన అవసరం లేదు. కొంత హ్యూమానిటీ ఉంచుకుందాం” అని పాండ్యా ఎమోషనల్ అయ్యాడు. మోడల్ - యోగా ట్రైనర్ అయిన మహీకా శర్మతో తన కొత్త రిలేషన్‌షిప్‌ను హార్దిక్ ఇటీవలే అధికారికంగా వెల్లడించాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో తన 32వ పుట్టినరోజుకు ముందు, ఇద్దరూ కలిసి బీచ్ వద్ద గడిపిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఈ రిలేషన్‌ను కన్ఫార్మ్ చేశాడు.24 ఏళ్ల మహీక ఓ మోడల్‌గా చేస్తోంది. చదువులో ఎకనామిక్స్, ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.వారి మధ్యలో ఎంగేజ్‌మెంట్ రూమర్స్ కూడా వచ్చాయి. అయితే మహీకా వాటిని ఖండిస్తూ “రోజూ మంచి జ్యువెలరీ వేసుకుంటాను.. అది కూడా అంతే” అంటూ నవ్వుతూ క్లారిటీ ఇచ్చింది. హార్దిక్ గతంలో మహీకాను తన జీవితంలో మూడు ప్రాధాన్యాల్లో ఒకటిగా పేర్కొన్నాడు. క్రికెట్, తన కుమారుడు అగస్త్య, ఆ తర్వాత మహీకా అంటూ ఆమెకు తన జీవితంలో గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. దాంతో పాపరాజీలు చేసిన పనికి చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు.