ఆ కార్లపై రూ.3.50 లక్షల తగ్గింపు.. Tata, మహీంద్రా సహా కంపెనీల ఇయర్ ఎండ్ ఆఫర్.. భారీ డిస్కౌంట్స్

Wait 5 sec.

EV Car Offers: దేశంలో విద్యుత్తు వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. అయితే, కొద్ది రోజులుగా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ స్తబ్దుగా కొనసాగుతోంది. మరోసారి ఈవీ కార్ల మార్కెట్ ఊపందుకునేలా చేసేందుకు దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీలైన మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యూందాయ్, కియా వంటివి రికార్డ్ స్థాయిలో ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్ ప్రకటించాయి. తమ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి. టాటా మోటార్స్ వంటి కంపెనీలు గరిష్ఠంగా రూ.3.50 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తుండడం గమనార్హం. మరి ఏ కారుపై ఎంత మేర తగ్గింపు లభిస్తోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కార్లపై వస్తు సేవల పన్ను (GST) రేట్లను సెప్టెంబర్ 22 నుంచి తగ్గించిన క్రమంలో ఈ పర్యావరణ హితమైన విద్యుత్తు కార్ల సేల్స్ గణనీయంగా పడిపోయాయి. జీఎస్టీ తగ్గడం వల్ల పెట్రోల్, డీజీల్ కార్ల ధరలు భారీగా దిగిరావడంతో కొనుగోలుదారులు వాటివైపే మొగ్గు చూపారు. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ తగ్గిపోయాయి. ఈ క్రమంలో మళ్లీ ఈవీల సేల్స్ పెంచేందుకు ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లీడర్ అయిన ఇదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్‌ఈవీ 9ఇ కారుపై రూ.3.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. గత వారం జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ మిడ్ నైట్ కార్నివాల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంజీ కామెంట్ ఈవీ కారుపై కొనుగోలుదారులు రూ.1 లక్ష వరకు ప్రయోజనాలు పొందుతారు. అలాగే జెడ్‌ఎస్ ఈవీ మోడళ్లపై రూ.1.35 లక్షల వరకు ప్రయోజనాలు అందుకుంటారు. కార్ల తయారీ కంపెనీలు ఐసీఈ మోడళ్లపైనా మంచి ఆఫర్స్ ఇస్తున్నా ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో పోలిస్తే ఈ ఆఫర్స్, డిస్కౌంట్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే, ఇయర్ ఎండ్ డిస్కౌంట్ వ్యూహానికి సంబంధించిన పూర్తి విషయాలను టాటా మోటార్స్ వెల్లడించలేదు. అయితే, మహీంద్రా అండ్ మహీంద్రా మాత్రం ఎలక్ట్రిక్ మోడల్స్ సేల్స్ పెంచడమే ప్రత్యేక లక్ష్యంగా ఈ ఇయర్ ఎండ్ ఆఫర్స్ తెచ్చినట్లు వెల్లడించింది. టాటా మోటార్స్‌లోని టాటా పంచ్ ఈవీ కారుపై రూ.1.75 లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే టాటా నెక్సాన్ కారుపై రూ.1.50 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. టాటా టియాగో ఈవీ కారుపై రూ.1.65 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇ వీటితో పాటు కియా ఈవీ6 కారుపై రూ.1.20 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. హ్యూందాయ్ ఐయానిక్ 6 కారుపై రూ.7 లక్షల వరకు తగ్గింపు బెనిఫిట్స్ కల్పిస్తోంది. వినియోగదారులకు అందే ప్రయోజనాల్లో ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్, క్యాష్ డిస్కౌంట్స్ వంటివి ఉంటాయని కంపెనీలు చెప్పాయి.