ప్రైవేట్ ఉద్యోగులకు అలర్ట్.. ఈ పని చేస్తేనే EPF సేవలు.. ఈపీఎఫ్ఓ కొత్త ప్రకటనలో ఏముందంటే?

Wait 5 sec.

EPFO: ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు బిగ్ అలర్ట్. ప్రావిడెంట్ ఫండ్ (PF Account) సంబంధించి మరోసారి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక ప్రకటన చేసింది. ఈపీఎఫ్ చందాదారులు సర్వీసులు అందుకునేందుకు వెంటనే తమ యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలని కోరింది. పీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ, విత్ డ్రా, పాస్‌బుక్ తనిఖీ వంటి వివిధ రకాల సేవలను పొందాలంటే తప్పనిసరిగా యూఏఎన్ యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అందుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ వేదికగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఓ పోస్ట్ చేసింది. 'ఈపీఎఫ్ సేవలు పొందాలంటే యూఏఎన్ యాక్టివేషన్ తప్పనిసరి. యూఏఎన్ యాక్టివేట్ చేసుకునేందుకు మీరు ఈ కింది 6 స్టెప్స్ ఫాలో అవండి' అంటూ రాసుకొచ్చింది. యూఏఎన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో సూచిస్తూ 6 అంచెల్లో ఉండే విధానాన్ని వివరించింది. పీఎఫ్ ఖాతా ఉన్న వారు కచ్చితంగా తమ యూఏఎన్ నంబర్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూఏఎన్ యాక్టివేట్ ఉన్న వారికి మాత్రమే ఈపీఎఫ్ఓ సేవలు అందుబాటులో ఉంటాయని తాజా ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది. 6 స్టెప్స్‌లో ఎలా యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలి?మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత ఇంపార్టెంట్ లింక్స్ విభాగంలో కనిపించే యాక్టివేట్ యూఏఎన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ యూఏఎన్, ఆధార్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. వివరాలు అన్నీ ఇచ్చిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్‌కి అంగీకారం తెలపాలిఆ తర్వాత గెట్ పిన్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీ యూఏఎన్ యాక్టివేట్ అయిపోతుంది.ఆ తర్వాత www.epfindia.gov.in వెబ్‌సైట్లోకి వెళ్లి వివిధ సేవలు పొందవచ్చు. సర్వీసెస్ విభాగంలో ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ ఎంచుకున్న తర్వాత. అది వివిధ సేవల సెక్షన్ లోకి తీసుకెళ్తుంది. అందులో మెంబర్ యూఏఎన్, ఆన్‌లైన్ సర్వీసెస్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీకు కావాల్సిన సేవలు పొందవచ్చు. ఈపీఎఫ్ చందాదారులు తమ యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.