భారతీయ టూరిస్ట్‌లకు అమెరికా షాక్.. ఆ ఉద్దేశంతో దరఖాస్తు చేస్తే వీసా రాదు!

Wait 5 sec.

వలసల విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తోన్న అమెరికా.. తాజాగా పర్యాటక వీసాలపై కూడా కొరడా ఝళిపించింది. టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు.. వ్యవస్థను దుర్వినియోగం చేయాలనే ఉద్దేశంతో ఉంటే వారికి ఇకపై సులభంగా వీసాలు లభించవు. తాజాగా భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పొందాలనే ఉద్దేశంతొ పర్యాటక వీసా దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తామని తేల్చిచెప్పింది. ‘‘పిల్లలకు అమెరికా పౌరసత్వం పొందడం కోసం మా గడ్డపై బిడ్డను ప్రసవించడమే ప్రధాన ఉద్దేశమైతే కాన్సులర్ అధికారులు పర్యాటక వీసా దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఇది అనుమతించబడదు’’ అని ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ పెట్టింది.అంతేకాదు, అమెరికా, ఆన్‌లైన్ కార్యకలాపాల సమీక్షను కూడా విస్తరించింది. భారత్‌లోని పలువురు దరఖాస్తుదారులకు వీసా అపాయింట్‌మెంట్‌లు వాయిదాపడినట్టు ఈమెయిల్‌లు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి ఒక ప్రకటనలో, విదేశాంగ శాఖ ఇప్పటికే F, M, J వంటి విద్యార్థి, సందర్శకుల వీసా వర్గాలకు సోషల్ మీడియా ఖాతాల తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సమీక్ష H-1B, H-4 దరఖాస్తుదారులకు కూడా డిసెంబర్ 15 నుంచి వర్తిస్తుంది.ట్రంప్ యంత్రాంగం ఇటీవల H-1B, H-4 దరఖాస్తుదారులందరికీ సోషల్ మీడియా స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఇది వేలాది మంది హెచ్-1బీ వీసాదారులు, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, ప్రతి కేసును క్షుణ్ణంగా భద్రతా సమీక్ష చేస్తామని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ‘‘ప్రతి వీసా కేసులో దరఖాస్తుదారు అమెరికా భద్రతకు ప్రమాదం కలిగించడని, కోరిన వీసాకు అర్హతను విశ్వసనీయంగా నిరూపించుకున్నారని, అలాగే నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలలో పాల్గొంటారని నిర్ధారణకు అవసరమైన సమయం తీసుకుంటాం’ అని ప్రకటనలో పేర్కొన్నారు.