మహిళలా? బీజేపీనా? ఎవరు శక్తిమంతులో చూడాలి.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ()పై మరోసారి తీవ్రంగా స్పందించారు. ఓటర్ల జాబితా నుంచి మహిళల పేర్లు తొలగిస్తే, వంటగదిలోని పనిముట్లతో సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో తమ పేర్లు తొలగిస్తే, మహిళలు తమ బలాన్ని ఉపయోగించి అన్యాయాన్ని ఎదిరించాలని ఆమె అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) పోస్ట్‌ల వద్ద వెళ్లొదని హెచ్చరించారు. కృష్ణానగర్‌లో ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా గురువారం నిర్వహించిన భారీ ర్యాలీలో బెంగాల్ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ సర్కారు, ఎన్నికల కమిషన్‌పై దీదీ విరుచుకుపడ్డారు. మాట్లాడుతూ.. ‘‘తల్లులు, సోదరీమణుల హక్కులను పేరుతో లాక్కుంటారా? ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి పోలీసులను రప్పించి తల్లులు, సోదరీమణులను భయపెడతారు.. సోదరీమణులారా? మీ పేర్లు తొలగిస్తే, మీ దగ్గర పనిముట్లు ఉన్నాయి కదా? వంట చేసేటప్పుడు వాడే పనిముట్లు. మీకు బలం ఉంది కదా? మీ పేర్లు తొలగిస్తే ఊరుకోరు కదా? మహిళలు ముందుండి పోరాడతారు, పురుషులు వారి వెనుక ఉంటారు’’ అని పిలుపునిచ్చారు.మహిళల శక్తి, బీజేపీ శక్తిలో ఎవరు ఎక్కువ శక్తిమంతులో చూడాలని ఆమె అన్నారు. ‘నేను మతతత్వాన్ని కాదు లౌకికవాదాన్ని నమ్ముతాను. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ డబ్బును ఉపయోగించి, ఇతర రాష్ట్రాల నుంచి మందిని తీసుకొచ్చి ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తుంది’ అని ఆమె ఆరోపించారు. గురించి దీదీ ప్రస్తావించారు. ‘మనం ఇంట్లో గీతను పారాయణం చేసుకుంటాం. బహిరంగ సభ ఎందుకు? దేవుళ్లు హృదయంలో ఉంటారు. అల్లాహ్ ను ప్రార్థించేవారు హృదయంలో ప్రార్థిస్తారు. రంజాన్, దుర్గా పూజ సమయంలో మనం కలిసి ప్రార్థిస్తాం. గీత గురించి అరుస్తున్న వారికి, శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడో నేను అడగాలనుకుంటున్నాను?. ధర్మం అంటే స్వచ్ఛత, మానవత్వం, శాంతి, హింస, వివక్ష, విభజన కాదు’ అని మమతా అన్నారు.‘రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప వ్యక్తులు ప్రజలను విభజించలేదు... ‘మరి మీరెవరు?’ అని ఆమె ప్రశ్నించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన బెంగాల్ ప్రజలు, తాము భారతదేశ పౌరులమని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ‘మీరు చేపలు, మాంసం తినాలా వద్దా అని మీరే నిర్ణయించుకుంటారు. బీజేపీ మిమ్మల్ని అది కూడా తిననివ్వదు. మీరే నిర్ణయించుకోవాలి. ఎవరు శాకాహారం, ఎవరు మాంసాహారం తినాలి అనేది వ్యక్తిగత ఎంపిక’ అని ఆమె అన్నారు.గాయపడిన పులి ఆరోగ్యంగా ఉన్న పులి కంటే భయంకరంగా ఉంటుందని మమతా బెనర్జీ హెచ్చరించారు. ‘మీరు మాపై దాడి చేస్తే, ఎలా ప్రతిస్పందించాలో మాకు తెలుసు. అన్యాయాన్ని ఎలా ఆపాలో మాకు తెలుసు’ అని ఆమె అన్నారు. బీజేపీ తన ఐటీ సెల్ తయారు చేసిన జాబితాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోందని ఆమె ఆరోపించారు. ‘గుర్తుంచుకోండి.. బీహార్ చేయలేకపోయింది, కానీ బెంగాల్ చేస్తుంది, మీరు ఏంచేసినా సరే’ అని ఆమె అన్నారు. ఎవరినీ బెంగాల్ నుంచి తమ ప్రభుత్వం బయటకు పంపనివ్వదని ఆమె అన్నారు. ‘నాది ఒకే ఒక అభ్యర్థన. సరిహద్దు ప్రాంతాల్లోని బీఎస్ఎఫ్ పోస్టుల దగ్గరకు వెళ్లవద్దు’ అని సూచించారు.