ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. నవంబర్‌లో 6 రోజులు సెలవులు, ఫుల్ లిస్ట్ ఇదే

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్ విద్యార్థులకు ముఖ్యమైన గమనిక.. నవంబర్ నెలలో సెలవుల లిస్ట్ ఇలా ఉంది. నవంబర్ 2న ఆదివారం సెలవు, అలాగే నవంబర్ 8న రెండో శనివారం సెలవు దినం. నవంబర్ 9న ఆదివారం వచ్చింది.. ఆ రోజు కూడా సెలవు. నవంబర్ 16న ఆదివారం సెలవు కాగా.. నవంబర్ 23న కూడా ఆదివారం సెలవు దినం. నవంబర్ 30న ఆదివారం సెలవు ఉంటుంది. ఈ నెల 5న కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి ఆప్షనల్ హాలిడే కాగా.. ఈ నెల 6న హజరత్ సయ్యద్ మొహ్మద్ జువాన్‌పూర్ మెహిదీ జయంతి కారణంగా ఆప్షనల్ హాలిడేగా ఉంది. ఈ నెలలో మొత్తం మొత్తం సెలవులు ఆరు కాగా.. వర్కింగ్ డేస్ 25గా ఉన్నాయి. నవంబర్ నెలలో రెండవ శనివారం, ఆదివారం తప్ప మరే ఇతర సెలవు దినాలు లేవు. గత నెల అక్టోబర్‌లో వరుసగా సెలవులు వచ్చాయి. గత నెల 24, 25, 26, 27 వరకు ఆయా జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. మొంథా తుఫాన్ కారణంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. దాదాపు నాలుగు రోజుల పాటూ స్కూళ్లు మూతపడ్డాయి. అంతకముందు సెప్టెంబర్ నెలలో దసరా సెలవులు కూడా భారీగా వచ్చాయి. అలాగే ఆగస్టు నెలలు కూడా వరుసగా సెలవులు వచ్చాయి. ఆగస్టులో మొత్తం 31 రోజుల్లో 10 రోజులు సెలవులు వచ్చాయి.. కేవలం 21 రోజులు మాత్రమే స్కూళ్లు, విద్యా సంస్థలు నడిచాయి. సెప్టెంబర్ నెలలో 22 నుంచి అక్టోబర్ 2 వరకు (11 రోజులు) దసరా సెలవులు ఇచ్చారు. అలాగే మరో మూడు ఆదివారాలు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ నెలలో కూడా స్కూళ్లకు ఏడు రోజుల పాటూ సెలవులు వచ్చాయి. కానీ నవంబర్ నెలలో మాత్రం ఆదివారాలు, రెండో శనివారం మినహా సెలవులు లేవు. మళ్లీ డిసెంబర్ నెలలో క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత జనవరి నెలలో సంక్రాంతి సెలవులు కూడా ఉంటాయి.