: స్మాల్ క్యాప్ కేటగిరిలోని ఎఫ్ఎంసీజీ సెక్టార్ సంస్థ ఎస్‌కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఇండియా లిమిటెడ్ () తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ షేర్లు అందుబాటులో ధరలో ఉండేందుకు కంపెనీ బోర్డు డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చేసేందుకు ఆమోదం తెలుపినట్లు వెల్లడించింది. మరి ఈ స్టాక్ స్ప్లిట్ వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. మరోవైపు ఈ కంపెనీ షేరు గత ఆరు నెలల్లోనే తమ షేర్ హోల్డర్లకు 115 శాతం లాభాన్ని ఇచ్చి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. లక్ష రూపాయల పెట్టిన వారికి ఆరు నెలల కాలంలోనే రూ.2.15 లక్షలకు పైగా వచ్చిట్లయింది. అలాగే ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత కంపెనీ షేరు ధర ప్రస్తుతం రూ. 417 వద్ద ఉండగా అది రూ. 208 స్థాయికి తగ్గుతుంది. ఈ స్టాక్ స్ప్లిట్ కంపెనీ చరిత్రలోనే తొలిసారి చేపడుతోంది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఇటీవలే జరిగిన కంపెనీ బోర్డు సమావేశంలో కంపెనీల చట్టం 2013 లోని సెక్షన్ 61 ని అనుగుణంగా 1:2 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టేందుకు ఆమోదం లభించింది. అంటే రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక ఈక్విటీ షేరు కొనుగోలు చేసినట్లయితే అది రూ. 5 ఫేస్ వ్యాల్యూ ఉండేలా 2 ఈక్విటీ షేర్లుగా మారుతుంది. అంటే 100 షేర్లు కొన్నవారి డీమ్యాట్ ఖాతాలో 200 షేర్లు జమ అవుతాయి. ఈ స్టాక్ స్ప్లిట్ అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు తేదీని త్వరలోనే బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయిస్తారని కంపెనీ తెలిపింది. అయితే, పెట్టుబడి విలువలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. షేర్ల సంఖ్య పెరుగుతుంది. క్రితం రోజు ట్రేడింగ్ సెషన్లో ఎస్‌కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఇండియా షేరు సుమారు 2.5 శాతం నష్టంతో రూ. 417 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 465, కనిష్ట ధర రూ.154 వద్ద ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ షేరు 14 శాతం లాభాన్ని అందించింది. గత నెల రోజుల్లో 31 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో 115 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఏడాదిలో 73 శాతం లాభాన్ని అందించింది. గత ఐదేళ్లలో 887 శాతం లాభాన్ని ఇచ్చింది మల్టీబ్యాగర్‌గా అవతరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 1100 కోట్ల వద్ద ఉంది.