నక్సల్స్‌కు బిగ్ షాక్.. తెలంగాణ-ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్ట్‌లు మృతి

Wait 5 sec.

ఇప్పటికే ఒకవైపు.. అగ్రనేతలు, కీలక నేతలు పోలీసుల ముందు లొంగిపోతుండగా.. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అలాంటి తరుణంలో తాజాగా మరోసారి మావోయిస్ట్‌లకు పెద్ద షాక్ తగిలింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మరో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతం మొత్తం తమ అధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు.. భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టుల మధ్య ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలోని అన్నారం-మరిమల అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని వచ్చిన పక్కా సమాచారంతో ఆ ప్రాంతం మొత్తం భద్రతా బలగాలు బుధవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మావోయిస్ట్‌లు భద్రతా బలగాలను చుట్టుముట్టినట్టు తెలుస్తోంది.వారి కదలికలను గుర్తించి.. అలర్ట్ అయిన భద్రతా బలగాలు.. మావోయిస్టులను గుర్తించగా.. వారు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో సుమారు ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఘటనా స్థలంలో భారీ మొత్తంలో ఆయుధ సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉన్నారా అనేది తేల్చేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే అధికారులు మాత్రం ఈ ఎన్‌కౌంటర్‌ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.2026 మార్చి నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా అంతమొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి.. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా నక్సలిజానికి వ్యతిరేకంగా విస్తృత ప్రచారాలను చేపడుతున్నాయి. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి.. సమర్పణ మరియు పునరావాస విధానం 2025, నియాద్ నెల్లా నార్ యోజన వంటి పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలకు ఆకర్షితులైన చాలామంది నక్సల్స్.. ఇప్పటికే లొంగిపోయి.. సాధారణ జీవితం గడుపుతున్నారు.