బిగ్‌బాస్ ప్రోమో: వాళ్లే విన్నర్ ఇంకెందుకు ఈ గేమ్ కంటిన్యూ చేయడం.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Wait 5 sec.

బిగ్‌బాస్ హౌస్ నుంచి శనివారం ఎపిసోడ్‌లో రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇంట్లోవాళ్లని చూడాలని ఉంది.. ఇక నేను ఈ హౌస్‌లో ఉండలేను అంటూ రాము తెగేసి చెప్పడంతో ఇక చేసేదేం లేక హోస్ట్ నాగార్జున డోర్స్ ఓపెన్ చేశారు. ఇలా శనివారం ఎపిసోడ్‌లో . ఇక ఈరోజు ఎపిసోడ్‌లో మరో ఎలిమినేషన్ జరగనుంది.ఇప్పటికే సాయి ఎలిమినేట్ అయినట్లు లీకైంది. ఇక తాజాగా వదిలిన ఆదివారం ప్రోమోలో ఎంటర్‌టైన్‌మెంట్ టాస్కులు పెట్టారు నాగార్జున. నేను ఒక వీడియో క్లిప్ చూపిస్తాను.. తర్వాత దానిపైన కొశ్చన్ అడుగుతాను.. ఎవరు ఫస్ట్ బెల్ కొట్టి ఆన్సర్ చెప్తారో వాళ్లు విన్నర్.. అంటూ నాగ్ చెప్పారు. ముందుగా దూకుడు సినిమాలోని స్పెషల్ సాంగ్ చూపించారు.మీరు చూసిన ఈ క్లిప్‌లో బ్రహ్మానందం గారి స్పెట్స్ కలర్ ఏంటి.. అని అడగ్గానే డీమాన్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఆ తర్వాత బెల్ కొట్టడానికి తనూజ-కళ్యాణ్ వచ్చారు. అయితే వీడియో క్లిప్ ప్లే చేసి కొశ్చన్ అడక్కముందే తనూజ గాంగ్ కొట్టేసింది. ఎందుకు కొట్టావ్ అమ్మ.. అని నాగ్ అడిగితే సారీ సార్ అంటూ తనూజ నవ్వింది.మిర్చి సినిమాలో చూపించిన ఈ పాటలో కిస్సింగ్ సౌండ్ ఎన్నిసార్లు వచ్చింది.. అని నాగ్ అడిగితే కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు కళ్యాణ్. నెక్స్ట్ రౌండ్‌కి ఇమ్మానుయేల్, రీతూ వచ్చారు. దీంతో ఇమ్మూ జాగ్రత్త.. వచ్చింది రీతూ.. అని నాగ్ అన్నారు. అవును సార్ నెత్తికేసి కొట్టినా కొట్టుద్ది.. అంటూ ఇమ్మూ కామెడీ చేశాడు. కరెక్ట్‌గా చెప్పావ్..అంటూ నాగ్ నవ్వుకున్నారు.వాళ్లే విన్నర్స్అత్తారింటికి దారేది సినిమాలో అమ్మో బాపుగారి బొమ్మో సాంగ్ చూపించారు. ఈసారి కూడా ప్రశ్న అడక్కుండానే రీతూ కొట్టేసింది. ఎలిమినేట్ చేయండి సార్.. అని ఇమ్మూ అడిగాడు. ఇక బాపుగారి చేతి గాజుల రంగు.. అని నాగ్ అడుగుతుండగానే బేబీ పింక్ అని కరెక్ట్‌గా చెప్పేసింది రీతూ.ఇలా రీతూ టీమ్‌యే ప్రతి రౌండ్‌లోనూ గెలుస్తుండటంతో నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వాళ్లే విన్నర్స్.. ఇంకెందుకు ఈ గేమ కంటిన్యూ చేయడం.. అని నాగ్ అన్నారు. మేము ఒక్కళ్లమే వచ్చి ఒకసారి కొడతాం సార్.. అంటూ ఇమ్మూ అన్నాడు. సరే ఈ కొశ్చన్‌కి 50 పాయింట్స్.. అని నాగ్ అన్నారు. మన్మథుడు సినిమాలో సాంగ్ క్లిప్ ప్లే చేశారు. ఇందుకు సంబంధించిన కొశ్చన్ అడిగితే మళ్లీ రీతూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది.మొత్తానికి ఇలా సండే ఎపిసోడ్ ఫుల్ ఫన్నీగా సాగుతుంది. అయితే నెక్స్ట్ ప్రోమోలో ఎలిమినేషన్ రౌండ్ చూపించబోతున్నరు. ఎలిమినేషన్ రౌండ్‌కి సాయి-భరణి రానున్నట్లు తెలిసింది. ఇందులో నుంచి సాయి ఎలిమినేట్ కాబోతున్నాడు.