: స్మాల్ క్యాప్ కేటగిరిలోని స్థిరాస్తి రంగంలోని ప్రముఖ కంపెనీ అజ్మెరా రియాలిటీ అండ్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ () కీలక ప్రకటన చేసింది. తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ తెచ్చింది. ఇటీవలే కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశమై చేయడానికి ఆమోదం తెలుపారని వెల్లడించింది. దీంతో ప్రతి 1 షేరు 5 షేర్లుగా మారనుంది. 100 షేర్లు కొన్న వారికి 500 షేర్లు వస్తాయి. ఈ స్ప్లిట్ తర్వాత ప్రస్తుతం రూ. 1023 స్థాయిలో ఉన్న షేర్ ధర దాదాపు రూ. 204 ల స్థాయికి తగ్గనుంది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఇటీవలే జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో కంపెనీల చట్టం 2013 లోని సెక్షన్ 61 ప్రకారం 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేసేందుకు ఆమోదం లభించింది. దీని అర్థం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉండేలా 5 షేర్లుగా విభజిస్తారు. చివరి ట్రేడింగ్ సెషన్లో అజ్మెరా రియాలిటీ అండ్ ఇన్ఫ్రా ఇండియా షేరు ధర 0.61 శాతం లాభంతో రూ. 1023 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1224.90, కనిష్ఠ ధర రూ. 681.55 వద్ద ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ షేరు 5 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో ఈ షేరు 1 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఆరు నెలల్లో 35 శాతం లాభాన్ని అందించింది. గత ఏడాది కాలంలో 9 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఐదు సంవత్సరాల్లో 973 శాతం లాభాన్ని అందించింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి ఇప్పుడు రూ.10.73 లక్షలకు పైగా లభిస్తాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ. 4020 కోట్ల వద్ద ఉంది. ఈ కథనం కేవలం సమాచారం ఇవ్వడానికి మాత్రమే. ఎలాంటి పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించడం లేదు. స్టాక్ మార్కెట్ అంటేనే తీవ్ర ఒడుదొడుకులు ఉంటాయి. సరైన అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టినట్లయితే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అన్నీ తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలి.