రాష్ట్రంలో అందులో భాగంగా అనేక చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల్లో.. సామాన్య పర్యాటకులకూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వసతి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. స్థానికులతో కలిసి సొంతింట్లో ఉన్న అనుభూతిని పర్యాటకులకు కల్పించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా గిరిజన, గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం అమలులో భాగంగా ఔత్సాహికులు హోమ్ స్టేలను ఏర్పాటు చేసుకునేలా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అందుకు సంబంధిచిన మార్గదర్శకాలు జారీ చేసింది.హోమ్‌ స్టేలో ఈ సౌకర్యాలు ఉండాలి.. పర్యాటక శాఖ మార్గదర్శకాల ప్రకారం.. హోమ్ స్టే ఏర్పాటు చేయాలనుకునే ఇంటి యజమానులు.. అక్కడే నివాసం ఉండాలి. వారు.. తమ ఇంట్లో కనీసం ఒకటి.. గరిష్ఠంగా ఆరు గదులను పర్యాటకులకు అద్దెకు ఇవ్వొచ్చు. ఇంట్లో కనీస వసతులు.. సురక్షిత మంచినీరు వంటివి అందుబాటులో ఉండాలి. శుభ్రమైన పరిసరాలు, టాయిలెట్లు ఉండాలి. ఏసీ, టీవీ, ఇంటర్నెట్, ఫర్నిచర్ వంటి వసతులతో పాటు పార్కింగ్ ప్రదేశం కూడా ఉండాలి. హోమ్ స్టేలకు వచ్చిన పర్యాటకుల వివరాలు (గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్‌) నమోదు చేసుకోవాలి. అవసమైనప్పుడు అధికారులు తనిఖీలు చేసేందుకు వీలుగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పర్మిషన్ ఇట్టే వచ్చేస్తుంది..!పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించారు. ఈ నేపథ్యంలో హోమ్‌స్టే విధానానికి త్వరితగతిన అనుమతులు లభించే అవకాశం ఉంది. ఆసక్తిగల ఇంటి ఓనర్లు దరఖాస్తు చేసుకునే సమయంలో.. గుర్తింపు, చిరునామా, ఆస్తి యాజమాన్య పత్రాలు, స్థానిక సంస్థల నుంచి నిరభ్యంతర పత్రం తదితర వివరాలు సమర్పించాలి. ఈ మేరకు సంబంధిత (homestays.staging.ap. gov.in) వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక పర్యాటక శాఖ అధికారులను కలిసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు..దరఖాస్తు తర్వాత అధికారులు ఇంటిని తనిఖీ చేస్తారు. అనంతరం అప్రూవల్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ తర్వాత లైసెన్స్ మంజూరు చేస్తారు. లైసెన్స్ వచ్చిన తర్వాత.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం వసతులు కల్పించాలి. కాగా, అరకు, విశాఖపట్నం, కోనసీమ, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో.. గిరిజన, వారసత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హోం స్టేలను అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఇప్పటికే దాదాపు 30 పర్యాటక కేంద్రాలను అధికారులు గుర్తించారు. అందులో అమరావతి ఆలయం, బౌద్ధ స్తూపం, కొండవీడు, కోటప్పకొండ, నాగార్జునకొండ, సత్రశాల, దైద, ఎత్తిపోతల తదితర ప్రాంతాలు ఇన్నాయి.