ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు?

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశగా అడుగులు పడుతున్నాయి.ని ఆరు వరుసలుగా విస్తరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదిత డీపీఆర్ మీద ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి విస్తరణపై ఇటీవల జిరిగిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలో .. జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేసిన అంశాలపై అధికారులను వివరణ అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే.. లో బెంజ్ సర్కిల్, ఔటర్ రింగ్ రోడ్ (ORR) మధ్య అండర్‌పాస్‌లు లేదా ఫ్లైఓవర్‌ల ప్రస్తావన లేకపోవడం పట్ల మంత్రి జనార్ధన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి చేర్చాలని NHAI అధికారులకు సూచించారు.మరోవైపు మచిలీపట్నం జాతీయ రహదారి ఆరు లైన్ల విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదిత డీపీఆర్ మీద గత బుధవారం స్టేక్ హోల్డర్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత డీపీఆర్ డిజైన్ మీద.. అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బెంజ్ సర్కిల్, చిన్న ఓగిరాల మధ్య ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి మార్పులు చేయాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే ప్రస్తుత డీపీఆర్‌లో వాహన అండర్‌పాస్‌లు లేవని , మెట్రో రైలు అధికారులతో సంప్రదించి 3 ప్రత్యామ్నాయ డిజైన్‌లను సిద్ధం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీటితో పాటుగా విజయవాడ నుంచి పెనమలూరు వరకు మెట్రో లైన్ ప్లాన్ చేస్తే, పైన మెట్రో, కింద రోడ్డు ఉండేలా డబుల్ డెక్కర్ నిర్మాణంగా రూపొందించాలని ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు సూచించారు,మరోవైపు శివారు ప్రాంతాలు, పోర్టు ఏరియాల నుంచి వాహనాల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడితే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా సమావేశంలో వ్యక్తమయ్యాయి. అలాగే 65వ నంబర్ జాతీయ రహదారి, జాతీయ రహదారి -16 మధ్య మెరుగైన అనుసంధానానికి కొత్త లింక్ రోడ్లు, అండర్‌పాసులు, స్ట్రీట్ లైట్లు, జంక్షన్లు నిర్మించాలని ప్రజాప్రతినిధులు సూచించారు. మరోవైపు విజయవాడ - మధ్య 64 కిలోమీటర్ల మేరకు రహదారి ఉంది. అయితే ఈ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో 62 కిలోమీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 2 కిలోమీటర్లు మేరకు రహదారి విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. అయితే బెంజ్ సర్కిల్ నుంచి కానూరు వరకు ఆరు వరుసలుగా రహదారిని విస్తరించేందుకు అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో 12 కిలోమీటర్ల మేరకు ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే కన్సల్టెన్సీ తయారు చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలో ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రస్తావన లేదు. దీంతో తాజాగా ఈ ప్రతిపాదనలు చేర్చాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ఈ ప్రతిపాదనలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు.. కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాతే.. ఈ ప్రాజెక్టు పనులు పట్టాలెక్కనున్నాయి.