: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారత అపర కుబేరుడు .. మరోసారి మంచి మనసు చాటుకున్నారు. దాతృత్వ కార్యక్రమాల్లో ముందుండే ఆయన.. మరోసారి వార్తల్లో నిలిచారు. ఆదివారం రోజు తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా.. కేరళ గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలోనే త్రిస్సూర్ జిల్లాలో బోర్డు నిర్మించ తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రాజెక్టు కోసం తొలి విడత కింద రూ. 15 కోట్ల విరాళం అందించారు. సంబంధిత చెక్కును దేవస్వోమ్ బోర్డు ఛైర్మన్‌కు అందించారు అంబానీ. కొద్ది రోజుల కిందట కూడా అంబానీ.. గత నెలలో అందించిన సంగతి తెలిసిందే. ఇలా తరచుగా ఆలయాల్ని సందర్శిస్తున్న అంబానీ.. అక్కడ వేర్వేరు కార్యక్రమాల కోసం పెద్ద మొత్తంలో విరాళాల్ని అందిస్తూనే ఉన్నారు.గురువాయూర్ ఆలయ సందర్శనకు ముందు అంబానీ ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా సందర్శించారు. అక్కడ స్వామి వారికి జరిగే సుప్రభాత సేవలో పాల్గొని వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకున్నారు. దర్శనం తర్వాత.. టీటీడీ అదనపు కార్యనిర్వాహక అధికారి వెంకయ్య చౌదరి సహా ఇతర అధికారులు అంబానీకి స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేద పండితులు.. రంగనాయకుల మండపంలో అంబానీకి వేదాశీర్వచనాలు అందించారు.అక్కడి నుంచి కేరళ చేరుకున్న అంబానీ.. గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయంలో పూజలు చేశారు. అక్కడ గురువాయూర్ దేవస్వోమ్ ఛైర్మన్ డా.వి.కె. విజయన్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. గురువాయూర్ ఆలయంలోని నాలంబలంలో గురువాయూరప్పన్‌కు అంబానీ.. ప్రత్యేక పూజలు చేసి, ధ్వజస్తంభం దగ్గర నైవేద్యాలు సమర్పించారు. తర్వాత విజయన్.. అంబానీకి తీర్థప్రసాదాలు, మురల్ పెయింటింగ్‌ను అందించారు. >> ఇక . ఈ మేరకు ఇటీవల ఎడెల్‌గివ్, హురూన్ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్ విడుదల చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే విరాళం ఏకంగా 54 శాతం పెరగడం విశేషం. పర్యావరణం సుస్థిరాభివృద్ధి, స్పోర్ట్స్ అండ్ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో అభివృద్ధి కోసం ఈ మొత్తం విరాళంగా అందించింది. దేశంలోని అత్యంత ధనవంతులు అంతా కలిసి 191 మంది ఏకంగా సంవత్సరం వ్యవధిలో రూ. 10,380 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇక్కడ శివ్ నాడార్ అండ్ ఫ్యామిలీ రూ. 2,708 కోట్లతో టాప్‌లో నిలిచింది.