: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బిలో పావర్టీ లైన్- BPL) ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు.. కేంద్ర ప్రభుత్వం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (NSAP) కింద 5 పథకాలు అమలు చేస్తోంది. . ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పనిచేస్తుంది. ఎన్ఎస్ఏపీ అనేది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వైకల్య పెన్షన్, కుటుంబ ప్రయోజనం & ఆహార భద్రత (అన్నపూర్ణ పథకం) వంటి వాటిని అందిస్తుంది. ఇక్కడ 5 పథకాల గురించి చూస్తే.. ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం, ఇందిరా గాంధీ జాతీయ పథకం, ఇందిరా గాంధీ జాతీయ వైకల్య పెన్షన్ పథకం, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, అన్నపూర్ణ పథకం వంటివి ఉన్నాయి. >> ఇక్కడ రూ. 200 పెన్షన్ వస్తుంది. 80 ఏళ్లుపైబడిన వారికి రూ. 500 చొప్పున అందుతుంది. వితంతు పెన్షన్ స్కీమ్ కింద 40-79 సంవత్సరాల వారికి రూ. 300 పెన్షన్ అందుతుంది. 80 ఏళ్లు దాటిన వారికి ఇక్కడ నెలకు రూ. 500 చొప్పున అందుతుంది. వైకల్య పెన్షన్ విషయానికి వస్తే.. 18-79 సంవత్సరాల వారికి నెలకు తీవ్ర వైకల్యం ఉంటే నెలకు రూ. 300 చొప్పున పెన్షన్ వస్తుంది. 80 ఏళ్లు దాటిన వారికి రూ. 500 చొప్పున అందుతుంది.ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ముఖ్య పోషకుడు (18-59 సంవత్సరాలు) మరణిస్తే ఒకేసారి రూ. 20 వేల సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతుంది.ఇక అన్నపూర్ణ స్కీమ్ కింద వృద్ధాప్య పెన్షన్‌ స్కీంకు అర్హులై.. పెన్షన్ రాని సీనియర్ సిటిజెన్లకు నెలకు 10 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు వస్తాయి. ఇక బీపీఎల్ కుటుంబాల్లోని అర్హులు ఈ పథకాల కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అయితే ఉమంగ్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. లేదా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ అయ్యాక.. NSAP అని సర్చ్ చేయాలి. అప్లై ఆన్‌లైన్‌పై క్లిక్ చేసి.. మీ ప్రాథమిక వివరాలు, పెన్షన్ చెల్లింపు విధానాన్ని ఎంచుకొని.. ఫొటో అప్‌లోడ్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లబ్ధిదారుల్ని గుర్తించడంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిల్లో 94 శాతం వరకు ప్రయోజనాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతిలో (బ్యాంక్ లేదా పోస్టాఫీస్ అకౌంట్ ద్వారా) అందుతాయి. ఈ పథకాల అమలును పర్యవేక్షించేందుకు ప్రతి రాష్ట్రం కూడా ఒక నోడల్ సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది.