ఏపీ డిప్యూటీ సీఎంలో నిరసనల సెగ తగిలింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ తిరుపతి కలెక్టరేట్ ఎదుట పలువురు నిరసనలకు దిగారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతికి వచ్చిన పవన్ కళ్యాణ్.. తిరుపతి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి పర్యటన సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ ఎదుట పలువురు ఆందోళనకు దిగారు. వీరిలో శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నేత డ్రైవర్ రాయుడు అలియాస్ శ్రీనివాస్ కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారూ.. మీరే న్యాయం చేయాలంటూ రాయుడు కుటుంబం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు ప్రదర్శించింది. రాయుడు పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అని.. కార్యకర్తగా కూడా పనిచేశాడని అతని కుటుంబసభ్యులు చెప్తున్నారు. అలాంటి వ్యక్తి చనిపోయి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ.. జనసేన నుంచి స్పందన లేదని.. పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని వారు కోరారు.మరోవైపు కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. జులై నెలలో రాయుడు హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం చెన్నై సమీపంలోని కూపం నది ఒడ్డున అక్కడి పోలీసులకు లభించింది. గుర్తు తెలియని మృతదేహం గురించి ఆరా తీసిన తమిళనాడు పోలీసులు.. అతడిని శ్రీకాళహస్తికి చెందిన రాయుడుగా గుర్తించారు. ఈ కేసులో కోట వినుతతో పాటుగా ఆమె భర్త చంద్రబాబు, మరికొందరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. కోట వినుతపై ఆరోపణలు రావటంతో జనసేన పార్టీ ఆమెను శ్రీకాళహస్తి ఇంఛార్జి పదవి నుంచి తప్పించింది. మరోవైపు ఈ కేసులో కొన్ని రోజుల పాటు జైళ్లో ఉన్న మరోవైపు ఈ కేసులో తమకు ఎలాంటి ప్రమేయం లేదని కోట వినుత చెప్తున్నారు. ఇదే సమయంలో చనిపోయిన రాయుడు సెల్ఫీ వీడియో ఇటీవల బయటకు వచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే రాయుడు వీడియో బయటకు వచ్చిన గంటల్లోనే చేశారు. తన వెనుక జరిగిన కుట్రలను ఆధారాలతో సహా త్వరలో బయటపెడతానంటూ ఆమె వీడియో విడుదల చేశారు. మరోవైపు రాయుడు కుటుంబసభ్యులు మాత్రం కోట వినుతపై ఆరోపణలు చేస్తున్నారు.