రెండో విడత ఎన్నికలు ఈనెల 11వ తేదీన జరగనుండగా.. జరగనున్నాయి. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి, బీజేపీ ఓట్ల చోరీ చేస్తోందని.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేయడం, తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే తొలి దశ పోలింగ్ సందర్భంగా.. ఎన్డీఏ కూటమిలో భాగమైన లోక్ జనశక్తి (రాంవిలాస్) పార్టీకి చెందిన ఎంపీ శాంభవి చౌధరీ.. ఓటు వేసిన తర్వాత బయటికి వచ్చి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఎంపీ శాంభవి చౌధరీ రెండు చేతుల చూపుడు వేళ్లకు సిరా ఈ ఫోటోలు వైరల్ కావడంతో.. ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ సహా పలువురు ఆమె రెండు సార్లు ఓటు వేశారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నవంబర్ 6వ తేదీన జరిగిన తొలిదశ పోలింగ్‌లో భాగంగా ఎంపీ శాంభవి చౌధరీ.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత ఆమె తన కుటుంబంతో కలిసి మీడియా ముందుకు వచ్చినప్పుడు ఈ గందరగోళం మొదలైంది. ఆమె రెండు చేతుల వేళ్లపై సిరా గుర్తు ఉండటాన్ని గుర్తించిన ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి కంచన యాదవ్.. ఇది మరో స్థాయి మోసమని.. ఇలా ఎలా జరుగుతుందని.. దీనిపై ఎవరు దర్యాప్తు చేస్తారని ప్రశ్నించారు.అయితే.. ఈ ఆరోపణలపై ఎంపీ శాంభవి చౌధరీ స్పందించారు. ఇది కేవలం మానవ తప్పిదం మాత్రమే.. ఈ వ్యవహారాన్ని అనవసరంగా వివాదం చేయవద్దని పేర్కొన్నారు. ఈ వివాదంపై పాట్నా జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి వివరణ ఇచ్చింది. తమ విచారణలో.. ఈ సంఘటనకు కారణం పోలింగ్ సిబ్బంది పొరపాటు అని తేలిందని అధికారులు స్పష్టం చేశారు.ఓటు వేసిన వారికి సిరా గుర్తు వేయాల్సిన పోలింగ్ సిబ్బంది.. పొరపాటున మొదట కుడిచేతి చూపుడు వేలికి ఇంకును వేశారని పేర్కొన్నారు. అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. సిరా గుర్తును ఎడమ చేతి వేలికి వేయాలని.. ఈ పొరపాటును ప్రిసైడింగ్ ఆఫీసర్ గుర్తించి జోక్యం చేసుకున్న తర్వాత.. నిబంధనలకు అనుగుణంగా ఎడమ చేతి వేలికి కూడా సిరా గుర్తు వేశారని వెల్లడించారు.ఎంపీ శాంభవి చౌధరీ.. బాంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 61లో మాత్రమే ఓటు వేశారని.. ఆమె ఓటు వివరాలు సీరియల్ నంబర్ 275లో నమోదు అయ్యాయని పాట్నా యంత్రాంగం స్పష్టతనిచ్చింది. తొలి దశ పోలింగ్‌లో 18 జిల్లాల్లోని 121 నియోజవర్గాల్లో ఓటింగ్ జరిగింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో నవంబర్ 11వ తేదీన రెండో విడత పోలింగ్ జరగనుంది.