జూబ్లీ'హిల్స్' ఎక్కేదెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో అనివార్యమైన ఈ ఉపఎన్నిక ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికను తీసుకున్నాయి. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోరు మాత్రం అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ఉంది. కారు పార్టీ నుంచి మాగంటి సునీత, హస్తం పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్, కమలం పార్టీ నుంచి దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం 8 గంటలకు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తరువాతఈవీఎం లెక్కింపు మొదలవుతుంది. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో కౌంటింగ్‌కు మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను 10 రౌండ్లలో లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌కు దాదాపు 45 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన తుది ఫలితం మధ్యాహ్నం 2 గంటలకల్లా వచ్చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఫిర్యాదులు లేదా వీవీప్యాట్ చీటీల లెక్కింపు ప్రక్రియ కారణంగా మొత్తం ప్రక్రియ సాయంత్రం 4 గంటలకల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.మొదటి రౌండ్ ఫలితం కాస్త ఆలస్యం కావొచ్చు. ఈవీఎంల సీళ్లను ఏజెంట్ల సమక్షంలో తొలగించి, ఓట్ల వివరాలను రిజల్ట్ మీట ద్వారా నమోదు చేస్తారు. అభ్యంతరాలు తలెత్తితే, రిటర్నింగ్ అధికారి వీవీప్యాట్ చీటీలను లెక్కించి నిర్ణయం తీసుకుంటారు. ఫిర్యాదులు లేకపోయినా, నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్ డబ్బాల్లోని చీటీలను లెక్కించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫలితాలను ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తారు. అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత, రిటర్నింగ్ అధికారి విజేతకు ధ్రువపత్రాన్ని అందజేస్తారు.ఇక ఇటీవల జరిగిన పోలింగ్ అనంతరం విడుదలైన భిన్నంగా ఉన్నాయి. మెజార్టీ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచిస్తుండగా.. మరికొన్ని బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడింది. 2009లో కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందగా, తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 నుంచి మాగంటి గోపినాథ్ వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. ఆయన మరణంతో అనివార్యమైన ఈ ఉపఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది.