పోస్టాఫీస్ గొప్ప స్కీమ్స్.. రూ. 10 వేలు జమ చేస్తే దేంట్లో ఎంతొస్తుంది.. ఫుల్ లిస్ట్ ఇదే

Wait 5 sec.

Sukanya Samriddhi Yojana: ఆర్బీఐ ఈ ఏడాదిలో కీలక రెపో రేట్లను వరుసగా తగ్గిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. 6.50 శాతం నుంచి వరుసగా 25, 25, 50 బేసిస్ పాయింట్ల మేర 3 దఫాల్లో మొత్తం ఒక శాతం వరకు వడ్డీ రేట్లు తగ్గించింది. ఆర్బీఐ రెపో రేట్లను తగ్గించిన క్రమంలో.. ఆయా బ్యాంకులు కూడా లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇదే క్రమంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చాయి. ఏడాది కిందట డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు ఉండగా.. ఇప్పుడు భారీగా తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు. దీంతో కొత్తగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలనుకునే వారికి నిరాశ ఎదురైంది. అయితే.. ఈ సమయంలో రిస్క్ లేకుండా మంచి రాబడి రావాలనుకునే వారికి ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఇప్పటికీ ఆకర్షణీయమైన స్థాయిలో వడ్డీ రేట్లు ఉన్నాయి. >> చాలా బ్యాంకుల్లో ఎఫ్‌డీల కంటే కూడా పోస్టాఫీస్ పథకాల్లో వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6-7 శాతం వరకే ఉన్నాయి. అదే పోస్టాఫీస్ పథకాల్లో చూస్తే 7 శాతం కంటే ఎక్కువగానే ఉన్నాయి. కొన్నింట్లో 8 శాతానికిపైగా కూడా ఉన్నాయి. ఇంకా దీర్ఘకాలంలో వీటిల్లో మెరుగైన రిటర్న్స్ అందుకోవచ్చు. పాత పన్ను విధానం కింద టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పోస్టాఫీస్ పథకాల్లో రెండేళ్ల టైమ్ డిపాజిట్‌లో వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. ఇక్కడ రూ. 10 వేలు జమ చేస్తే.. వార్షిక ప్రాతిపదికన వడ్డీ రూ. 719 వస్తుంది. మూడేళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 7.10 శాతం కాగా.. ఇక్కడ రూ. 10 వేలు డిపాజిట్ చేస్తే రూ. 729 వడ్డీ వస్తుంది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్ పథకం వడ్డీ రేట్లు 7.50 శాతంగా ఉండగా.. ఇక్కడ రూ. 10 వేలు జమ చేసిన వారికి వార్షికంగా రూ. 771 వస్తుంది. . ఇక్కడ ఒక్కసారి పెట్టుబడిపై ఐదేళ్ల పాటు ప్రతి 3 నెలలకు ఓసారి వడ్డీ అందుతుంది. మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి కూడా తిరిగొస్తుంది. ఇక్కడ రూ. 10 వేలు జమ చేసిన వారికి ప్రతి త్రైమాసికానికి (3 నెలలకు) రూ. 205 చొప్పున వడ్డీ వస్తుంది. మంత్‌లీ ఇన్‌కం అకౌంట్ విషయానికి వస్తే ఇక్కడ వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది. రూ. 10 వేలపై నెలకు రూ. 62 చొప్పున వడ్డీ వస్తుంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 7.7 శాతంగా ఉంది. ఇక్కడ కాల పరిమితి ఐదేళ్లుగా ఉంటుంది. ఈ లెక్కన రూ. 10 వేలు జమ చేస్తే మెచ్యూరిటీకి ఇది రూ. 14,490 అవుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. ఈ స్కీంలో వరుసగా 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ ఏటా రూ. 10 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీకి అంటే 15 ఏళ్లకు రూ. 2.71 లక్షలు వస్తాయి. కిసాన్ వికాస్ పత్ర పథకంలో వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంది. ఇక్కడ 115 నెలల్లో పెట్టుబడిపై రెట్టింపు రాబడి వస్తుంది. అదే మెచ్యూరిటీ అని గుర్తుంచుకోవాలి. . ఇక్కడ కూడా వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. ఇక్కడ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. పాప వయసు పదేళ్లలోపే చేరాలి. వరుసగా 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి 21 ఏళ్లకు అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. 18 ఏళ్లు దాటి పెళ్లి చేసే సమయంలో పూర్తిగా తీసుకోవచ్చు. అప్పుడు ఏటా రూ. 10 వేల చొప్పున జమ చేస్తే.. మెచ్యూరిటీకి రూ. 4.61 లక్షలు వస్తాయి.