ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి రిజర్వేషన్లు.. ఆరు నెలల్లోపు అమలు చేయాల్సిందే.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

Wait 5 sec.

కు సంబంధించి.. కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా ట్రాన్స్‌జెండర్లకు అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మెగా డీఎస్సీ చేపట్టిన సంగతి తెలిసిందే చేశారు. అయితే మెగా డీఎస్సీలో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ కల్పించలేదంటూ.. ఏలూరు జిల్లాకు చెందిన రేఖ హైకోర్టులో పిటిషన్ వేశారు. డీఎస్సీలో ట్రాన్స్‌జెండర్ వర్గానికి పోస్టులు నోటిఫై చేయలేదని.. దీంతో అధికారులు తనను ఉద్యోగానికి ఎంపిక చేయలేదంటూ రేఖ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోస్టులు కేటాయించకపోవడమేది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఇరువర్గాల వాదనలు వింది. అనంతరం ఆరు నెలల్లోగా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ల కోటా అమలు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే పిటిషనర్‌ను స్కూల్ అసిస్టెంట్‌గా నియమించే విషయాన్ని కూడా పరిగణించాలని స్పష్టం చేసింది. జస్టిస్ న్యాపతి విజయ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్నారని.. వారిని తిరిగి జనజీవనంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా అన్ని రంగాల్లో వారికి అవకాశం కల్పించడానికి ఒక సమగ్రమైన విధానం అవసరమన్నారు. కేంద్రం తెచ్చిన ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం-2019 అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు.. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. 2019లో సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం తెచ్చింది. ఈ అమలు చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లను అమలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఆరు నెలల్లోగా ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా్న్ని హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించడంతో పాటుగా ట్రాన్స్‌జెండర్లను జనజీవనంలోకి తీసుకువచ్చేందుకు రిజర్వేషన్లు అవసరమని హైకోర్టు పేర్కొంది. మరోవైపు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెనికి చెందిన ట్రాన్స్‌జెండర్( ఉమెన్) రేఖ.. మెగా డిఎస్‌సిలో 671వ ర్యాంక్ సాధించారు. అయితే ట్రాన్స్‌జెండర్ కోటా లేకపోవడం వలన ఆమెను స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రేఖ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.