మళ్లీ భారీగా పడిపోయిన బంగారం ధర.. రెండ్రోజుల్లో భారీ పతనం.. ఈరోజు 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే

Wait 5 sec.

: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా రెండో రోజూ భారీగా పడిపోయాయి. అమెరికాలో షట్ డౌన్‌కు ట్రంప్ సర్కార్ ముగింపు పలకడంతో పాటు, కీలక ఉద్యోగ గణాంకాల రిపోర్ట్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు తగ్గేందుకు కారణమైనట్లుగా తెలుస్తోంది. డిసెంబరులో మరోసారి 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి. అయితే వడ్డీ రేట్లు తగ్గించే యోచనలో లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఒక్క కారణంతో బంగారం ధరల్లో ఒక్కసారిగా మార్పు కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పడిపోవడంతో ఆ ప్రభావం దేశీయంగానూ స్పష్టంగా కనిపించింది. తులం రేటు ఏకంగా రూ. 3500 పైన దిగివచ్చింది. ఈ క్రమంలో నవంబర్ 16వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం గోల్డ్ రేటు ఎంతకు తగ్గిందో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పడిపోతున్నాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 109 డాలర్ల మేర పడిపోవడం గమనార్హం. దీంతో ఔన్స్ స్వచ్ఛమైన బంగారం ధర 4080 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 4.89 శాతం మేర పడిపోయింది. దీంతో సిల్వర్ ధర ఔన్సుకు ఈరోజు 50.62 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో మళ్లీ తగ్గిన బంగారంహైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై క్రితం రూ.1580 మేర తగ్గగా ఇవాళ మరో రూ.1960 మేర పడిపోయింది. దీంతో ఈరోజు తులం స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ.1,25,080 వద్దకు పడిపోయింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఈరోజు మరో రూ.1800 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాముల ఆభరణాల గోల్డ్ రేటు రూ.1,14,650 వద్దకు దిగివచ్చింది. రూ.4000 తగ్గిన వెండి రేటుక్రితం రోజుతో పోలిస్తే ఈరోజు కిలో వెండి రూ.4,100 మేర పడిపోవడం గమనార్హం. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,75,000 మార్క్ వద్దకు దిగివచ్చింది. అయితే, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి ఇతర మార్కెట్లలో కిలో రూ.1,69,000 వద్ద లభిస్తుండడం గమనార్హం. పైన చెప్పిన గోల్డ్, సిల్వర్ రేట్లు నవంబర్ 16వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, పసిడి రేట్లు మధ్యాహ్నానికి మారుతుంటాయి. ప్రాంతాలను బట్టి ధరల్లో తేడాలు ఉంటాయి. కొనుగోలు చేసే ముందే తెలుసుకోవడం మంచిది.