విశాఖపట్నం వేదికగా జరుగుతున్న కు భారీ స్పందన వస్తోంది. ఈ సదస్సు రాష్ట్రానికి భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. మొత్తం 60 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం 613 ఎంవోయూలు కుదుర్చుకుంది. ఫలితంగా . జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ కంపెనీ అయిన రాష్ట్రంలో రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. ఆ వివరాలు..రాయలసీమ దశ తిరిగబోతుంది. రేమండ్ గ్రూప్ ఈ ప్రాంతంలో.. రూ.1201 కోట్ల పెట్టుబడులతో 3 ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అపారెల్, ఆటో, ఏరోస్పేస్ రంగాల్లో రేమండ్ గ్రూప్ ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికల వేళ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీని.. రాబోయే 3-4 ఏళ్లలో చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.20 లక్షల పెట్టుబడులు సాధించామని ఆయన గుర్తు చేశారు. తాజాగా రేమండ్ గ్రూప్ రాష్ట్రంలో భారీగా పెట్టుబుడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని.. మరో రెండు సంవత్సరాల్లో అనగా 2027 నాటికి ఈ మూడు ప్రాజెక్టులను ప్రారంభిస్తుందని చంద్రబాబు తెలిపారు.సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాయలసీమలో డ్రోన్, స్పేస్ సిటీలకు శంకుస్థాపన చేశామన్నారు. ఇప్పటికే ఇక్కడ కియా మోటార్స్ ఉందని.. దీనికి తోడు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏరోస్పేస్, డిఫెన్స్ కారిడార్లు కూడా రాబోతున్నాయని ప్రకటించారు. విమానాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఉత్పత్తి కూడా పెరగాలని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. రేమండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా పరికరాలు తయారు చేయడం ప్రశంసనీయం అని చంద్రబాబు కొనియాడారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం వరల్డ్ డేటా సెంటర్‌గా అవతరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పర్యాటక రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఈక్రమంలో రేమండ్ గ్రూప్ ఎండీ గౌతమ్ మయానీ మాట్లాడుతూ.. ఏపీలో రూ.1201 కోట్లతో మూడు ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నామని తెలిపారు. దీనిలో భాగంగా.. రాప్తాడులో రూ. 497 కోట్లతో అపారెల్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్ రాబోతుందని తెలిపారు. అలానే అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ. 441 కోట్లతో ఆటో కాంపోనెంట్ తయారీ ఫ్యాక్టరీ స్థాపిస్తామని.. అదే జిల్లాలో టేకులోడు వద్ద రూ. 262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ 3 ప్రాజెక్టుల ద్వారా మొత్తం 6,500 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు.