ఏపీలో ఇదేం విచిత్రం.. నవంబర్‌లో తాటి ముంజలు అమ్మేస్తున్నారు, కారణం తెలిస్తే!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ఓ విచిత్రం కనిపిస్తోంది. ఎప్పుడో ఎండాకాలంలో, అది కూడా మార్చి, ఏప్రిల్ నెలలో కనిపించే తాటి ముంజలు ముందుగానే వచ్చేశాయి. నాలుగు నెలలు ముందుగానే రోడ్లపై కనిపిస్తున్నాయి. విచిత్రంగా నవంబర్ నెలలోనే తాటి ముంజలు అందుబాటులోకి రావడం ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. తాటి ముంజలు రోడ్లు పక్కన ఉంచి కొంతమంది విక్రయిస్తున్నారు. విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో ఈ విచిత్రమైన సన్నివేశం కనిపించింది.. ఇదంతా చూసి కొందరు షాకవుతున్నారు. జనాలు కూడా తాటి ముంజల్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఏటా ఎండాకాలంలో ఏప్రిల్‌ నెలలో మొదలవుతుంది. ఎండ తీవ్రతను నుంచి ఉపశమనం కోసం జనాలు తాటి ముంజల్ని తింటుంటారు. కానీ ఇప్పుడు రోడ్ల పక్కన నవంబర్‌లోనే తాటి ముంజలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నంలోని భీమిలి బీచ్ రోడ్డులో సీతకొండ దగ్గర తాటి ముంజల్ని విక్రయిస్తు్న్నారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం ప్రాంతాల నుంచి వీటిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఆ వ్యక్తి డజను తాటి ముంజలు రూ.100 చొప్పున విక్రయించారు. జనాలు కూడా తాటి ముంజల్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం నవంబర్‌లో తాటి ముంజలు ఏంటని చర్చించుకుంటున్నారు.గతేడాది డిసెంబర్‌ నెలలోనే కూడా విక్రయించారు. విజయవాడలో కొందరు తాటి ముంజలు, మామిడి పండ్లను అమ్మారు. అయితే ఇలా నవంబర్, డిసెంబర్ నెలలోనే తాటి ముంజలు, మామిడి పండ్ల దిగుబడి ఎలా వచ్చిందని అక్కడ విక్రయిస్తున్నవారిని ఆరా తీశారు. వీటిని పైరుకాపు ఉత్పత్తులని అంటారట.. తోటలోని వందల చెట్లలో కొన్ని ఇలా ముందే కాయలు కాస్తాయట. వీటిని తీసుకొచ్చి ఇలా విక్రయిస్తున్నారు.. అందకే నాలుగు నెలలు ముందుగానే ఈ సీజన్ ప్రారంభమైంది. ఏపీలో ఇలా తాటి ముంజల్ని తీసుకొచ్చి రోడ్డు పక్కన అమ్మేస్తున్నారు కొందరు వ్యక్తులు. మామిడి పండ్ల విషయానికి వస్తే.. మామిడి పండ్ల దిగుబడి మార్చి నెల నుంచి మొదలవుతుంది. అలా మామిడి పండ్ల సీజన్ ఆగస్టు నెల వరకు కొనసాగుతుంది.. ఆ తర్వాత వచ్చే మామిడి పండ్ల కాపును పునారస అంటారు.. ఈ పండ్లను తినరు పచ్చడి కోసం ఉపయోగిస్తారు. ఈ కాయలు ఏడాది పొడవునా లభిస్తాయట. మొత్తం మీద ఎండాకాలంలో రావాల్సిన తాటి ముంజలు నాలుగు నెలలు ముందుగానే రావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఏడాది కూడా డిసెంబర్‌లో మామిడి కాయలు మార్కెట్‌లోకి వస్తాయనే చర్చ కూాడా జరుగుతోంది. పైరు కాపు ఉత్పత్తులు రాగానే మామిడి పళ్లు కూడా విక్రయించే అవకాశం ఉంది అంటున్నారు.