ఇన్వెస్టర్లకు కాసులు కురిపించిన ఎస్బీఐ, ఎల్ఐసీ.. ముంచేసిన రిలయన్స్, టీసీఎస్, ఎయిర్‌టెల్!

Wait 5 sec.

Top Companies MCap: బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువనే.. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణిస్తుంటారు. అంటే.. ఆయా కంపెనీల విలువ పడిపోతుంటే.. అంత మేర ఇన్వెస్టర్లు నష్టపోయారనే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కంపెనీల షేర్లు పుంజుకుంటే మార్కెట్ విలువ పెరుగుతుంది. దానికి తగ్గట్లుగానే ఇన్వెస్టర్లకు లాభాలు వస్తుంటాయి. ఇదే సమయంలో స్టాక్స్ పతనం అయితే.. ఇన్వెస్టర్ల సంపద తగ్గుతూ వస్తుంది. ఇక గత వారం భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టపోయిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా అనిశ్చితి, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణకు తోడు.. ఇక్కడ అంతకుముందు లాభాల్ని సొమ్ము చేసుకునేందుకు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడటంతో సూచీలు నష్టపోతూ వచ్చాయి. ఈ క్రమంలోనే గత వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 722 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ చూస్తే 230 పాయింట్లు తగ్గింది. గత వారం సూచీలు పతనంతో.. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 466 లక్షల కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో టాప్- 10 కంపెనీల్లో చూస్తే.. 7 కంపెనీల మార్కెట్ విలువ రూ. 88,635.28 కోట్లు తగ్గడం గమనార్హం. ఇక్కడ భారతీ ఎయిర్‌టెల్ సహా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లు భారీగా తగ్గుముఖం పట్టగా వీటి విలువే ఎక్కువగా పడిపోయింది. రూ. 11.41 లక్షల కోట్లకు దిగొచ్చింది. ఇక టీసీఎస్ విలువ రూ. 23 వేల కోట్లు తగ్గడంతో రూ. 10.82 లక్షల కోట్లకు పడిపోయింది. గత కొంత కాలంగా టీసీఎస్ షేరు దారుణంగా పడిపోయింది. హిందుస్థాన్ యూనిలివర్ మార్కెట్ క్యాప్ రూ. 12 వేల కోట్లకుపైగా తగ్గడంతో ఇప్పుడు అది రూ. 5.67 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ విలువ రూ. 7 వేల కోట్లకుపైగా పతనంతో రూ. 15.11 లక్షల కోట్లకు దిగొచ్చింది. ఇన్ఫోసిస్ ఎం- క్యాప్ రూ. 2 వేల కోట్లు తగ్గి.. రూ. 6.13 లక్షల కోట్లుగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ చూస్తే రూ. 1587 కోట్లు తగ్గి రూ. 9.59 లక్షల కోట్లకు చేరుకుంది. వీటికి భిన్నంగా.. . దీని విలువ రూ. 18 వేల కోట్లకుపైగా పెరగడంతో రూ. 5.84 లక్షల కోట్లుగా ఉంది. ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ. 17 వేల కోట్లకుపైగా పెరిగి రూ. 8.82 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక బజాజ్ ఫినాన్స్ ఎం- క్యాప్ రూ. 15 వేల కోట్ల వరకు పెరిగి రూ. 6.63 లక్షల కోట్లకు చేరుకుంది. వరుసగా మోస్ట్ వాల్యూడ్ కంపెనీలు చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్‌లో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, హిందుస్థాన్ యూనిలివర్ ఉన్నాయి.