: వాడేవారికి పరిమితి గురించి తెలిసే ఉంటుంది. దీనినే క్రెడిట్ కార్డు లిమిట్ అంటారు. అయితే చాలా మందికి ఇక్కడ కార్డును జాగ్రత్తగా ఎలా వాడాలో తెలిసుండదు. లిమిట్ మొత్తం వాడేస్తుంటారు. కొందరు పరిమితికి మించి కూడా వినియోగిస్తుంటారు. ఇక్కడే అసలు జాగ్రత్తలు తీసుకోవాలి. కార్డును ఎలా వాడాలో తెలుసుకోవాలి. ప్రతి క్రెడిట్ కార్డుకు కూడా ఒక పరిమితి ఉంటుంది. ఇది కార్డుకు సంబంధించిన ఖర్చు విషయంలో చాలా కీలకమైనది. ఇక క్రెడిట్ కార్డు పరిమితిని.. కార్డును జారీ చేసే సంస్థ నిర్ణయిస్తుంది. కార్డును.. పరిమితి మేరకే వినియోగించాల్సి ఉంటుంది. ఒకవేళ లిమిట్ దాటితే.. కొన్ని బ్యాంకులు ఇక్కడ ఓవర్ లిమిట్ ఛార్జీలు విధిస్తుంటాయి. ఇంకొన్ని బ్యాంకులు మాత్రం లిమిట్ దాటాక.. కార్డును వాడుకునే అవకాశం కూడా కల్పించవు.>> ఇక్కడ ఓవర్ లిమిట్ సదుపాయం ఉపయోగిస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అప్పుడు భవిష్యత్తులో మీరు లోన్ ఆమోదం పొందే అవకాశాలు తగ్గుతాయని చెప్పొచ్చు. అంగీకరించొచ్చు. ఇంకా కార్డ్ హోల్డర్.. ప్రతి నెలా కార్డుపై ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నప్పుడు కూడా లిమిట్ పెంచమని బ్యాంకును కోరే వీలు ఉంటుంది. ఇదే సమయంలో మీ ఆదాయం/జీతం పెరిగినప్పుడు కూడా సదరు రుజువుల్ని బ్యాంకుకు చూయించి.. క్రెడిట్ లిమిట్ పెంచామని బ్యాంకును కోరొచ్చు.మీరు అర్హతను కలిగి ఉండి.. అదనపు లిమిట్ కావాలనుకుంటే కూడా పొందొచ్చు. క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్న వారికి.. ఎన్నో బ్యాంకులు క్రెడిట్ కార్డుల్ని ఆఫర్ చేస్తుంటాయి. ఎక్కువ కార్డులు వినియోగిస్తే కూడా క్రెడిట్ కార్డు లిమిట్ పెరుగుతుంటుంది. అప్పుడు క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR) మెరుగ్గా నిర్వహించొచ్చు. సాధారణంగా ప్రతి క్రెడిట్ కార్డులోని పరిమితిలో 30 శాతంలోపే వినియోగించాలి. >> కార్డు పరిమితి పెంచుకునేందుకు ఆదాయం కీలక పాత్ర పోషిస్తుంటుంది. అంటే ఇక్కడ దరఖాస్తుదారుడికి.. బకాయిల్ని తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం ఉండాలి. కొన్ని బ్యాంకులు.. నెలవారీ ఆదాయానికి 2 రెట్ల వరకు క్రెడిట్ కార్డు లిమిట్ అందిస్తుంటాయి. ముందుగా కార్డు ఇచ్చేటప్పుడు లిమిట్ తక్కువగానే ఇచ్చినా.. వాడుతున్న దాన్ని బట్టి ఇక్కడ లిమిట్ పెంచేందుకు చూస్తుంటాయి. కార్డుపై మంచి లిమిట్ ఉంది కదా అని పూర్తిగా వాడేయకూడదు. క్రెడిట్ లిమిట్‌కు మించి వాడితే స్కోరు పడిపోయే ప్రమాదం ఉంటుంది.