అప్పుడు నాన్నగారి మాట వినలేదు.. ‘వారణాసి’తో ఆయన కల నెరవేరుస్తున్నా - మహేశ్

Wait 5 sec.

తనను ఇంతగా అభిమానించే ఫ్యాన్స్‌కి చేతులెత్తి నమస్కరించడం తప్ప వాళ్ల రుణం తీర్చుకోలేనని అన్నారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రానికి సంబంధించి ‘గ్లోబ్ ట్రోటర్ ’ ఈవెంట్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు మహేష్‌బాబు లుక్, ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా స్టేజీ పైకి ఎద్దుపై ఎంట్రీ ఇస్తూ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశాడు మహేశ్‌బాబు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. బయటికొచ్చి చాలా రోజులైంది. కొంచెం కొత్తగా ఉన్నా మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా బాగుంది. నా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో మీరే చూశారుగా. నా స్టైల్‌లో సింపుల్‌గా వస్తానంటే కుదరదు అన్నారు. షర్ట్‌కి గుండీల్లేవు అంటే అదే స్టైల్ అన్నారు. ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మనలేదు. నెక్ట్స్ అదేనేమో. ఇదంతా మీకోసమే. మీరంతా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ధ్యాంక్స్. అప్‌డేట్స్ ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. అవి చూస్తుంటే నాకే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. ఆయన చెప్పిన ప్రతి మాటని గౌరవించాను, పాటించాను. కానీ ఒక్కటి మాత్రం చేయలేదు’‘ఆయన నన్నెప్పుడూ పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. ఆ మాట నేను వినలేదు. ఇవాళ నా మాటల్ని ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. లైఫ్‌లో ఒక్కసారి వచ్చే అవకాశం. దీనికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడతాను. ‘’ రిలీజైనప్పుడు దేశమంతా గర్వపడుతుంది. ఇది జస్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. మీరంతా ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారు. థాంక్స్ అనేది చాలా చిన్నమాట. మీ అభిమానాన్ని నేను మాటల్లో చెప్పలేను. మీ అభిమానానికి చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంకేం చేయలేను. నేను, మా టీమ్ పోలీసుల సాయంతో ఈ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేశాం. మీరు ఇంటికి క్షేమంగా చేరుకుంటే మేం చాలా హ్యాపీగా ఉంటాం. మీ ఆశీస్సులు ఎప్పుడూ మాతోనే ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ప్రసంగాన్ని ముగించారు మహేశ్‌బాబు.