ఐపీఎల్ 2026కు కెప్టెన్‌ను ప్రకటించిన CSK.. అతడికి షాక్‌..!

Wait 5 sec.

ఐపీఎల్ 2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎంఎస్ ధోనీ కెరీర్‌ చరమాంకానికి చేరడంతో అతడికి బదులుగా ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్‌ కోసం ఇన్నాళ్లు వెతికింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను ట్రేడ్ చేసుకుంది. దీంతో అతడిని కెప్టెన్‌గా నియమిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ క్లారిటీ ఇచ్చింది. తమ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడే అని ప్రకటించింది. దీంతో సంజూ కేవలం ప్లేయర్‌గానే సీఎస్కే తరఫున అరంగేట్రం చేయనున్నాడు.ఐపీఎల్ 2026 వేలానికి ముందు శనివారం అంటే నవంబర్ 15న అన్ని ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించాయి. చెన్నై సూపర్ కింగ్స్‌.. మతీశ పథిరాన, రాహుల్ త్రిపాఠి, వన్ష్‌ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్‌, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేశ్‌ నగార్‌కోటిని విడుదల చేసింది. దీంతో రెండో అత్యధిక పర్స్‌తో ఐపీఎల్ వేలానికి వెళ్లనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌ ఖాతాలో ప్రస్తుతం రూ.43.4 కోట్లు ఉన్నాయి.సంజూ శాంసన్‌ను రూ.18 కోట్లకు సీఎస్కే ట్రేడ్ చేసింది. అయితే గత సీజన్‌లో రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ గాయపడటంతో ధోనీ తిరిగి సారథ్య బాధ్యతలు చేప్టటాడు. ఇక వచ్చే సీజన్‌లో శాంసన్ కెప్టెన్‌ అవుతాడనే ప్రచారం జరిగినా.. దాన్ని సీఎస్కే తోసిపుచ్చింది. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలన్నింటినీ కొట్టిపారేస్తూ రుతురాజ్ గైక్వాడే సీఎస్కే కెప్టెన్ అని చెన్నై సూపర్ కింగ్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. దీంతో సంజూ శాంసన్ కెప్టెన్ కాదని అధికారికంగా ప్రకటించినట్లయింది.ఐపీఎల్ 2026 వేలానికి ముందు సీఎస్కే రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు ఎవరంటే.. ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్‌నిత్‌ సింగ్, జేమీ ఒవర్టన్, ముకేశ్‌ చౌదరి, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్, రామకృష్ణ ఘోష్‌, సంజు శాంసన్ (ట్రేడ్), శివమ్ దూబె, శ్రేయస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, ఆయుష్‌ మాత్రే, ఉర్విల్ పటేల్, డివాల్డ్ బ్రెవిస్.